close

తాజా వార్తలు

ఆరేళ్ల పాప పక్కతడుపుతోంది!

మా అక్క కూతురికి ఆరేళ్లు. తను చెప్పకుండానే దుస్తుల్లోనే మూత్రం పోసుకుంటుంది. రాత్రిపూటే కాదు... మెలకువగా ఉన్నా ఇలానే చేస్తోంది.  తనని ఎలా మార్చాలి?

- లక్ష్మి, ఈమెయిల్‌

సాధారణంగా పిల్లలు అయిదేళ్లు వచ్చే సరికే పక్క తడిపే అలవాటు మానుకుంటారు. కొందరు చిన్నారుల్లో పది, పదిహేనేళ్ల వరకూ కొనసాగుతుంది. దీన్ని ప్రైమరీ ఎన్యూరిసిస్‌ అంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడైనా దుస్తుల్లోనే మూత్రం పోసేసుకుంటారు. ఇంకొందరిలో అయిదేళ్లు వచ్చే సరికి సమస్య తగ్గినా మళ్లీ రెండుమూడేళ్ల తరువాత కొనసాగవచ్చు. దీన్ని సెకండరీ ఎన్యూరిసిస్‌ అంటారు. మూత్రాశయం మీద నియంత్రణ లేకపోవడాన్ని ఎన్యూరిసిస్‌గా పేర్కొనవచ్చు. చిన్నారుల మెదడు అభివృద్ధి, నాడులు పరిపక్వం చెందకపోవడం... ప్రైమరీ ఎన్యూరిసిస్‌కు కారణాలు. తల్లిదండ్రులు కాలకృత్యాలు తీర్చుకోవడం నేర్పించకపోయినా చిన్నారులు ఇలా చేసే అవకాశం ఉంది. పిల్లలకు మూత్రాశయం, మూత్రనాళం, మూత్ర ద్వారం దగ్గరి కండరాలు సరిగా పనిచేయకపోయినా ఈ సమస్య ఎదురుకావొచ్చు. ఇలాంటి వారిని మొదట యూరాలజిస్ట్‌కు చూపించాలి. వారు కొన్ని పరీక్షలు చేసి సమస్య ఏంటో తెలియజేస్తారు. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల్లో మెదడు ఎదుగుదల ఆలస్యమవుతుంది. వీరిలోనూ ఈ ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి సమస్య ఏమిటో మనం కచ్చితంగా తెలుసుకోవాలి. అన్నీ బాగానే ఉండి చిన్నారి పక్క తడుపుతుంటే... వైద్యులు మూత్రాశయం మీద పట్టు తెచ్చుకునేలా కొన్ని వ్యాయామాలు సూచిస్తారు.
మీ పాప విషయంలో... సమస్య ఇప్పుడే మొదలైందా... మొదటి నుంచే ఉందా అనే విషయం మీరు స్పష్టంగా రాయలేదు. సమస్య ఇప్పుడు మొదలై, చిన్న విషయాలకే ఏడవడం, మెలకువగా ఉన్నా మూత్రం పోయడం వంటివి చేస్తుంటే మానసికంగా ఏదైనా సమస్య ఉందేమో అనిపిస్తోంది. ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల మధ్య గొడవలు, పాపను బలవంతంగా బడికి పంపించడం, ఆమెకు ఇష్టం లేని పనులు చేయడం వంటివి పాపపై ప్రభావం చూపించాయేమో తెలుసుకోండి.
మీరేం చేయాలంటే... మీ పాప సమస్య ప్రైమరీ ఎన్యూరిసిసా లేదా సెకండరీనా కనుక్కోవాలి. అందుకోసం వైద్యుల దగ్గరకు తీసుకెళ్లండి. మానసిక నిపుణులు చిన్నారి పరిస్థితి అంచనా వేస్తారు. అవసరమైతే పాపకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. యూరాలజిస్ట్‌ పరీక్ష చేసి మూత్ర సంబంధ సమస్యలుంటే చికిత్స చేస్తారు. ఒకవేళ ఎన్యూరిసిస్‌ ఉండి... ఇతర శారీరక సమస్యలు లేకపోతే టాయిలెట్‌ ట్రైనింగ్‌, బ్లాడర్‌ కసరత్తులను నేర్పిస్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.