close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కేంద్ర మంత్రి పదవికి శివసేన ఎంపీ రాజీనామా!

ఉత్కంఠ రేకెత్తిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో సోమవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రి అరవింద్‌ సావంత్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. జనవరిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు ముగింపు

తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియకు వచ్చే ఏడాది జనవరిలోపు ముగింపు పలకాలని పురపాలక శాఖ నిర్ణయించింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ పర్వానికి ముగింపు పలికి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కార్యాచరణను రూపొందించడంపై దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పాత పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు 2015 నవంబరులో అనుమతి ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మద్యం బానిసలకు వ్యసన విముక్తి

మద్యానికి బానిసలైన వారిని గుర్తించి వ్యసన విముక్తి కేంద్రాల్లో చేర్పించే బాధ్యతను గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్‌ మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. తొలిదశలో జిల్లాకొకటి చొప్పున 13 జిల్లాల్లోని బోధనాసుపత్రుల్లో వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తామని చెప్పారు. మద్యం వైపు తిరిగి వారు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పురపాలక కేంద్రాల్లోనూ రూ.5కే భోజనం

హైదరాబాద్‌లో అమలు చేస్తున్న రూ.5 భోజనం పథకాన్ని త్వరలో పురపాలక కేంద్రాల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఆమె అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఇటీవల గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఉల్లిక్కి పడే ధర

ఉల్లి ధర అంతకంతకూ పెరుగుతోంది. రైతుబజార్లలో కిలో రూ.36 చొప్పున పలుకుతుంటే బయట మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.75 వరకు పలుకుతోంది. వినియోగదారుల కష్టాలిలా ఉంటే.. మరోవైపు పండించిన ఉల్లిని అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు యార్డుకు వస్తే నాలుగైదు రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఈనెల 11 దాకా సరుకు తేవద్దని.. అవసరమైతే తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్ముకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పోలవరం ఫిర్యాదులపై విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పునరావాసం, పరిహారంపై దాఖలైన అన్ని ఫిర్యాదులపై పునర్‌విచారణ చేపట్టాలని జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీ)కి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఇటీవల పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. సామరస్యాన్ని కాపాడదాం

అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా మెలగాలని దేశంలోని హిందూ, ముస్లిం మతాలకు చెందిన పలువురు అగ్రశ్రేణి మతపెద్దలు పిలుపునిచ్చారు. తీర్పును అందరూ గౌరవించాలని కోరారు. ఇతరత్రా అంశాల కన్నా జాతి ప్రయోజనాలే అందరికీ శిరోధార్యమని పేర్కొన్నారు. తీర్పు నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ రెండు మతాల పెద్దలతో ఆదివారం సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మందిరం నిర్మాణానికి 5 ఏళ్లు?

కోర్టు తీర్పు వెలువడడంతో ఇక అందరి దృష్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణంపైనే పడింది. మందిరం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది. విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) రూపొందించిన నమూనా ప్రకారమయితే పనులు పూర్తికావడానికి దాదాపు అయిదేళ్లు పడుతుంది. కనీసం 250 మంది శిల్పులు నిరంతరాయంగా కృషి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఉద్యోగ అనుమతులు తొలగించలేం

అమెరికాలో నివసిస్తున్న వేలాదిమంది భారతీయులకు తాత్కాలిక ఊరట! హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల(హెచ్‌-4 వీసాదారులు) ఉద్యోగ అనుమతులను రద్దు చేసేందుకు అక్కడి న్యాయస్థానమొకటి నిరాకరించింది. ఈ వ్యవహారంలో మరింత లోతైన పరిశీలన అవసరమని అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బంగ్లాపై భారత్‌దే సిరీస్‌

గట్టి పోటీనే ఎదుర్కొన్నా ఆఖరికి భారత్‌దే పైచేయి. బంగ్లాదేశ్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్‌ ఇండియా 2-1తో చేజిక్కించుకుంది. దీపక్‌ చాహర్‌ (6/7), శివమ్‌ దూబె (3/30) విజృంభించడంతో ఆదివారం మూడో టీ20లో భారత్‌ 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేయగా.. ఛేదనలో విండీస్‌ 9 వికెట్లకు 101 పరుగులే సాధించగలిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.