
తాజా వార్తలు
న్యూదిల్లీ: హాస్టల్ ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఉదయం నుంచే వర్సిటీ ప్రాంగణానికి వందలాది మంది విద్యార్థులు చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో పోలీసులకు, ఉపకులపతికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మూడో స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ హాజరయ్యారు. ఫీజు పెంపును నిరసిస్తూ ముందుగానే ఆందోళనకు పిలుపునిచ్చిన విద్యార్థులు ఏఐసీటీఈ వైపుగా దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసినా కొందరు విద్యార్థులు వాటిని దాటేందుకు యత్నించారు. దీంతో వారిపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించి చెదరగొట్టారు. విద్యార్థుల ఆందోళనతో కేంద్రమంత్రి పోఖ్రియాల్ ఏఐసీటీఈ ప్రాంగణంలో చిక్కుకున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఆయన బయటకు రాలేని పరిస్థితి నెలకొనడంతో సాయంత్రం హాజరవ్వాల్సిన రెండు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
గతంలో రూ.2,500గా ఉన్న హాస్టల్ ఫీజును రూ.7వేలు చేశారని, సుమారు 300 శాతం పెంచారని విద్యార్థి నాయకులు చెబుతున్నారు. ఈ నిర్ణయం పేద విద్యార్థులను ఓ విధంగా చదువుకు దూరం చేయడమేనని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో పాటు కర్ఫ్యూ సమయాల్లో మార్పు, వస్త్రధారణపై ఆంక్షలు వంటివి కూడా సరికావని వారు పేర్కొన్నారు. తమతో ఎలాంటి చర్చలూ జరపకుండా ఫీజు పెంపుపై నిర్ణయం తీసుకున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. వీసీ జగదీశ్ కుమార్ వెంటనే తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
