
తాజా వార్తలు
అమరావతి: ఉద్యోగాలు రావాలంటే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితులు నెలకొన్నాయనీ.. ఆంగ్లం రాకపోతే పోటీని తట్టుకొని నిలబడలేమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామంటే కొందరు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. మన పిల్లలు ఆంగ్లం బాగా చదవగలిగితే మంచిది కాదా అన్నారు. ఆంగ్ల మాధ్యమంపై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్నవాళ్లు.. వాళ్ల పిల్లలను ఏ మాధ్యమంలో చేర్పించారని ప్రశ్నించారు. సోమవారం విజయవాడలో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..
‘‘పేదరికం నుంచి బయటపడే మార్గం చదువొక్కటే. రాష్ట్రంలో నిరక్షరాస్యులు 33శాతం మంది ఉన్నారు. పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవకపోతే రాష్ట్రం నష్టపోతుంది. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేలా కార్యాచరణ చేపడతాం. ప్రతి బడిలోనూ ఆంగ్ల ల్యాబ్లు ఏర్పాటు చేస్తాం. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం. 1 నుంచి 6 తరగతుల వరకు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉంటుంది. ఆ తర్వాత ఏటా 7, 8, 9, 10 తరగతులను కలుపుకొంటూ వెళ్తాం. అమ్మఒడి కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడుతున్నాం. ఇంకా తేదీని ఖరారు చేయలేదు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ ఏటా రూ.15వేలు అందిస్తాం.
నాకు కొంచెం టైం ఇవ్వండి!
మదర్సాల గురించి కూడా ఆలోచించాలని మంత్రి నన్ను కోరారు. మదర్సాలకు మేలు చేకూర్చేలా మదర్సాల బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రిని ఆదేశిస్తున్నా. గత ప్రభుత్వం ఇచ్చిన పెళ్లి కానుక ఇప్పుడు అమలు కావడంలేదు. నాకు కొంచెం సమయమివ్వండి. మార్చిలో బ్రహ్మాండంగా వైఎస్ఆర్ పెళ్లికానుక తీసుకొస్తాం. ఒక్కొక్కరికీ గతంలో ఇచ్చిన రూ.50 వేలను రెట్టింపు చేసి లక్ష చొప్పున ఇస్తాం. ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తాం’’ అని జగన్ అన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
