
తాజా వార్తలు
హైదరాబాద్: సీఎం కేసీఆర్తో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ అయ్యారు. మిషన్ భగీరథ పథకం పనులు జరుగుతున్న తీరును కేసీఆర్ను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్రమంత్రికి సీఎం, అధికారులు వివరించారు. దీంతోపాటు మిషన్ కాకతీయ పథకం కింద 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేసినట్లు సీఎం ఆయనకు తెలిపారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం దాదాపుగా పూర్తయిందని చెప్పారు. 24వేల ఆవాస ప్రాంతాలకు రోజూ ఉపరితల జలాలను అందిస్తామని.. వచ్చే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభా అవసరాలు తీర్చేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని కేసీఆర్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ తరహా పథకం దేశమంతటా అమలైతే మంచిదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలకు మంచినీరు అందించే పథకాలను ఆర్థిక కోణంలో చూడొద్దని.. మిషన్ భగీరథ పథకం నిర్వహణకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. అనంతరం గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను ప్రశంసించారు. మిషన్ భగీరథ తరహాలో దేశవ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉందని తెలిపారు. రాష్ట్రాల భాగస్వామ్యంతోనే మంచినీటి పథకాలు అమలు చేస్తామని చెప్పారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
