close

తాజా వార్తలు

సవాల్‌కిసై అనండి

చాలామంది అమ్మాయిలు సవాళ్లు తీసుకోలేరని కెరీర్‌లో అందుకే వెనకబడుతుంటారని అంటారు. సొంతంగా చేయగలమా? అనే భయమూ ఎక్కువే. వాటిని అధిగమించేందుకు ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయి. 

అందరి సామర్థ్యాలు ఒకేలా ఉండకపోవచ్ఛు కానీ మిమ్మల్ని మీరు సానబెట్టుకోగలిగితే...అదేమీ అసాధ్యం కాదు. ఉన్నతాధికారి మిమ్మల్ని పిలిచి ఏవైనా బాధ్యతలు అప్పగించగానే... ‘నేను చేయగలనా?’ అని అస్సలు అనుకోవద్ధు ప్రయత్నిస్తేనే లోటుపాట్లు తెలిసేది. ప్రణాళికతో అడుగులేస్తే కచ్చితంగా చేయగలను అని ముందు మనసులో అనుకోండి. అని సాధ్యం చేయడానికి అవసరమైన మార్గాలను వెతకండి. ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు.

పనిలో పొరపాట్లు సహజం. వాటిని ఊహించుకుని తడబడటం, తప్పు చేస్తామేమో అనే ఆలోచనతో అసలు ప్రయత్నమే చేయకపోవడం అసమర్థత అవుతుంది. అదే వద్ధు చేసిన పొరపాటు మరోసారి చేయకుండా చూసుకోవడమే మీ విజయానికి తొలిమెట్టు అని గుర్తుంచుకోండి.

చెబితేనే చేస్తా... నా పని ఇంతవరకే అనుకుంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లే. మీ పరిధిలో మాత్రమే పనిచేయడం అనే తీరు మీ సంకుచితత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అలాగని అన్నీ నెత్తిన వేసుకోమని కాదు... కీలక సమయాల్లో ముందడుగు వేసే చొరవ అవసరం. పనిలో లోటుపాట్లు తెలుసుకుని అవి రాకుండా మీరేం చేయగలరో ఆలోచించుకోవడం వంటివన్నీ మిమ్మల్ని అందలం ఎక్కిస్తాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.