
తాజా వార్తలు
కాలుష్యం, సూర్యకాంతి, దుమ్ము, ధూళి, తీసుకునే ఆహారం... ఇవన్నీ మన చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దాంతో చర్మం నల్లగా మారుతుంది. అరటిపండు తొక్క ఈ సమస్యలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది.
అరటిపండు తొక్క, కొద్దిగా వంటసోడా, కాసిని నీళ్లు మిక్సీలో తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఉండే మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ముఖచర్మం తాజాగా, కోమలంగా మారుతుంది. ●
* ఒక అరటిపండు తొక్కను మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా కలబంద గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి... పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే కంటికింద నల్లటి వలయాలు, వాపు సమస్య తగ్గిపోతుంది.
* జిడ్డుచర్మం ఉన్నవారు ఈ పూతను ప్రయత్నిస్తే చక్కటి ఫలితాలు పొందొచ్ఛు చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, ఒక అరటితొక్కను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి కాసేపాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంలో అధికజిడ్డు వదులుతుంది.
* పాదాల పగుళ్లు ఇబ్బంది పెడుతున్నాయా... ముందుగా గోరువెచ్చటి నీటిలో పాదాలను కాసేపు ఉంచి ప్యూమిస్ రాయితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మృతకణాలు పోతాయి. ఆ తరువాత అరటిపండు తొక్క ముద్దలో కాస్తంత కొబ్బరినూనె కలిపి ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- 8 మంది.. 8 గంటలు
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
