close

తాజా వార్తలు

బెయిర్‌స్టోను తీవ్రంగా మందలించిన ఐసీసీ

ఆక్లాండ్‌: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను సోమవారం ఐసీసీ తీవ్రంగా మందలించింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఐదో టీ20లో చెలరేగిపోయిన ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ (47; 18 బంతుల్లో 2x4, 5x6) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ప్రమాదకరంగా ఆడుతున్న అతడిని ఏడో ఓవర్‌లో జేమ్స్‌ నీషమ్‌ బోల్తా కొట్టించాడు. టిమ్‌ సీఫర్ట్‌ చేతికి చిక్కిన బెయిర్‌స్టో ఆ సమయంలో పరుష పదాలు ఉపయోగించాడు. అవి టీవీలో వినిపించగా ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు వెయ్న్‌ నైట్స్‌, క్రిస్‌గఫానీ ఫిర్యాదు చేశారు. 

మ్యాచ్‌ అనంతరం బెయిర్‌స్టో తన తప్పుని ఒప్పుకోవడంతో  ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవెల్‌ 1 కింద అతడికి ఒక డీ మెరిట్‌ పాయింట్‌ శిక్ష విధించారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌ ఫర్‌ ప్లేయర్స్‌ అండ్‌ ప్లేయర్స్‌ సపోర్ట్‌ పర్సనల్‌ ఆర్టికల్‌ 2.3 ప్రకారం ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్‌లో పరుష పదాలు ఉపయోగించరాదు. ఈ నిబంధన అతిక్రమిస్తే కనిష్ఠంగా ఐసీసీ మందలింపు, మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత ఉంటుంది. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్‌ పాయింట్లను ఐసీసీ శిక్షగా విధిస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.