close

తాజా వార్తలు

రోగనిరోధకశక్తికి బాదం

చలికాలంలో గాల్లో తేమ ఎక్కువ ఉండటంతో కాలుష్యం సమస్యా పెరుగుతుంది.  దీన్నుంచి బయటపడాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని చూడండి.

* బొప్పాయికి కాలుష్యం కారణంగా ఎదురయ్యే సమస్యలను నిరోధించే గుణం ఉంటుంది. అందుకే దీన్ని సూపర్‌ఫుడ్‌ అని  అంటారు. వీటిని తరచూ ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* కాఫీలను తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా గ్రీన్‌టీ, అల్లంటీ వంటివి తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, చక్కెరలు అధికంగా ఉండే ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని పూర్తిగా మానేయాలి.

* సాధారణంగా చలికాలంలో జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మసాలాలు లేని, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను ఎంచుకుంటే మంచిది. వేపుళ్లను వీలైనంతవరకూ తగ్గించాలి.

* టొమాటోలో ఉండే లైకోపిన్‌ శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తుంది. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

* విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఉసిరి, జామ పండ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. బాదం, జీడిపప్పు, డ్రైఫ్రూట్స్‌లో మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తుంది. కాలుష్యంతో వచ్చే శ్వాసనాళాల ఇన్‌ఫెక్షన్లను అడ్డుకునే శక్తి వీటికి ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

* మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. చికెన్‌, మటన్‌కు ప్రత్యామ్నాయంగా ఒమేగాత్రీ ఫ్యాటీ యాసిడ్లు అందే చేపలు, గుడ్డు వంటివి ఎంచుకోవాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.