close

తాజా వార్తలు

ప్రెషర్‌ కుక్కర్‌ ఎలా ఉడికిస్తుంది?

ప్రశ్న: ప్రెషర్‌ కుక్కర్లో అన్నం త్వరగా ఉడుకుతుంది. ఎందుకని?

- పి. మహేష్‌, హైదరాబాద్‌

అన్నంలో ఉన్న కార్బోహైడ్రేట్లు పెద్ద పెద్ద అణువులు. వాటిలో ఉన్న c-o-c అనే బంధాల్ని నీటి సమక్షంలో తెంచి నీటిని కలపడమే అన్నం ఉడకడంలో ఉన్న ప్రక్రియ.
* ఇలా జరగాలంటే సరైన ఉష్ణోగ్రత ఉండాలి.
* ఆ ఉడికే ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా, అంత తొందరగా అన్నం ఉడుకుతుంది.
* 100 డిగ్రీల సెంటిగ్రేడు కన్నా అధిక ఉష్ణోగ్రతలో ఉడికిస్తే అన్నం బాగా ఉడుకుతుంది. కానీ సాధారణంగా నీరు 100 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత దగ్గర ఆవిరవుతుంది.
* కాబట్టి సాధారణ పీడనం దగ్గర నీటి ఉష్ణోగ్రతను 100 డిగ్రీల సెల్సియస్‌కి మించి పెంచలేం. అయితే ద్రవాల బాష్పీభవన ఉష్ణోగ్రత (ఆవిరయ్యే ఉష్ణోగ్రత) ఆ ద్రవంపై ఉన్న పీడనాన్ని బట్టి మారుతుంది.
* పీడనం ఎక్కువయితే ఆవిరయ్యే ఉష్ణోగ్రత కూడా ఎక్కువ అవుతుంది. దీన్నే క్లాసియస్‌ - క్లాపిరాన్‌ నియమం అంటారు.
* ప్రెషర్‌ కుక్కర్లో పీడనం పెరగడం వల్ల అందులో ఉన్న నీరు 110 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత దాటినా ఆవిరి కాదు. కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రత అందడం వల్ల అన్నం తొందరగా ఉడుకుతుంది. అన్నమే కాదు... పప్పు, మాంసం, దుంపలూ తొందరగా ఉడుకుతాయి.

- ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.