
తాజా వార్తలు
కంటిపాపలపై ఓ తండ్రి కర్కశత్వం
కుమార్తెలను చిత్రహింసలు పెడుతూ చిత్రీకరణ
ఆ వీడియోలను విదేశంలోని భార్యకు పంపి బెదిరింపులు
నరసాపురం, న్యూస్‌టుడే: ఎన్నికష్టాలు చుట్టుముట్టినా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే బాధ్యత మరిచాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. జీవనోపాధి కోసం విదేశంలో పని చేస్తున్న భార్య డబ్బు పంపడం లేదని, బిడ్డల్ని చిత్రహింసలకు గురిచేస్తూ...ఆ దృశ్యాల్ని వీడియో తీసి పంపేవాడు. ఈ దారుణ ఉదంతం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మధ్య సారవకు చెందిన ఉల్లంపర్తి ఎలిషా, మహాలక్ష్మి భార్యాభర్తలు. కీర్తి(8), మమ్ము(6) వీరి కుమార్తెలు. ఏడాది కిందట మహాలక్ష్మి జీవనోపాధి కోసం దుబాయి వెళ్లారు. అక్కడి నుంచి ఆమె పంపుతున్న డబ్బుతో ఎలిషా జల్సాలకు అలవాటు పడ్డాడు. తరచూ డబ్బు పంపాలని భార్యను ఫోనులో బెదిరించేవాడు. ఆమె స్పందించక పోవడంతో చిన్నారులను చిత్రహింసలకు గురి చేస్తూ ‘అమ్మా... నాన్నకు డబ్బులు పంపు... లేకపోతే మమ్మల్ని చంపేస్తాడు’ అంటూ మాట్లాడించే వాడు. ఆ దృశ్యాల్ని వీడియోలు తీసి, వాట్సాప్ ద్వారా భార్యకు పంపేవాడు. అతనితో పాటు ఎలిషా సోదరి కూడా చిన్నారులను దారుణంగా హింసించేది. ఈ వీడియోలను చూసిన మహాలక్ష్మి తల్లడిల్లింది. తమ బంధువులకు ఆ దృశ్యాల్ని పంపడంతో అవి సామాజిక మాధ్యమాల్లో సంచలనంఅయ్యాయి. నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎలిషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మానవత్వానికే మచ్చ..
ఈ ఉదంతంపై స్పందించిన రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మంగళవారం నరసాపురం వచ్చారు. తండ్రి చేతిలో చిత్రహింసలకు గురైన చిన్నారులను డీఎస్పీ కార్యాలయంలో పరామర్శించారు. దుబాయిలోని మహాలక్ష్మితో చిన్నారుల చేత మంత్రి వీడియోకాల్ ద్వారా మాట్లాడించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఘటన మానవత్వానికే మచ్చ అని, చిన్నారుల తండ్రి, మేనత్తపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల్ని తణుకులోని బాలల సంరక్షణ కేంద్రంలో చేర్పించి రక్షణ కల్పిస్తామన్నారు. వారిని చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
