
తాజా వార్తలు
15 రోజుల్లో పోలీస్ శిక్షణ
రాంనగర్, న్యూస్‌టుడే: పోలీసు ఉద్యోగం కోసం మూడు సార్లు పోటీ పడిన ఆ యువకుడు ఆఖరికి విజయం సాధించాడు.. ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో రైలు మృత్యురూపంలో వచ్చి అతన్ని అనంతలోకానికి తీసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే... రాంనగర్ డివిజన్ అంబేడ్కర్ నగర్‌కు చెందిన విజయ్‌కుమార్, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. విజయ్‌కుమార్ సిగరెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు కల్యాణ్(27)కు ఈ నెల 14న వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. 28వ తేదీన పోలీస్ కానిస్టేబుల్‌గా ట్రైనింగ్‌కు వెళ్లాల్సి ఉంది. సోమవారం ఉదయం 3గంటల సమయంలో విద్యానగర్ ప్లాట్ఫారం నంబర్-2 పట్టాల మధ్య రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మొదట గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. మంగళవారం కల్యాణ్‌గా గుర్తించడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. రాంనగర్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
