close

తాజా వార్తలు

మాతృభాషను విస్మరిస్తే మట్టిలోకే..:పవన్‌

విజయవాడ: తెలుగు భాషను విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోక తప్పదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. మాతృభాష పరిరక్షణ కోసం ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు బయటకు రావాలని పవన్‌ పిలుపునిచ్చారు. తమిళ భాషపై చిన్న మాట అంటే ఆ రాష్ట్రం మొత్తం ఒక్కటైందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మన నేతలకు తెలుగు భాష, సంస్కృతిపై ప్రేమ లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఈ అంశంపైనా రాజకీయాలు తీసుకొస్తున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన భాషను చంపుకోవడమంటే మన ఉనికిని చంపుకోవడమేనన్నారు. తెలుగు మాద్యమంలో చదవాలనే ఆసక్తి కనబరిచే ఒక్క విద్యార్థి ఉన్నా.. ఆ పాఠశాలలో కచ్చితంగా తెలుగు బోధించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.