
తాజా వార్తలు
విశాఖపట్నం: ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులు సహా, పలువురు నేతలు భాజపాలో చేరే అవకాశముందని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో ఇవాళ విశాఖలో సమావేశమైనట్లు చెప్పిన ఆయన.. త్వరలోనే తమ బలం మరింత పెరగబోతోందన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వివిధ పార్టీల నేతలతో చర్చల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. భాజపా ఎదుగుదలలో ఇదొక అంకం మాత్రమే. గంటా శ్రీనివాసరావుతో సమావేశమైతే ఏ అంశాలు చర్చకు వస్తాయో అందరికీ తెలిసిందే.. ఆ అంశాలపైనే చర్చించాం. రాబోయే రోజుల్లో శాసనసభలో భారతీయ జనతాపార్టీకి మంచి స్థాయి వస్తుంది. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ జడ్పీటీసీ సభ్యులు భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో భాజపానే ప్రత్యామ్నాయ శక్తిగా బలపడుతుంది. అధికారం చేపట్టేదిశగా ప్రయత్నాలు చేస్తున్నాం... అందులో భాగంగానే వివిధ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నాం’’ అని సోము వీర్రాజు వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
