close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నేడు కీలక తీర్పులు

దేశంలో సంచలనం కలిగించిన మూడు అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీర్పు ఇవ్వనుంది. ఇందులో ఒకటి శబరిమలలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించే అంశం ఒకటి కాగా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో మార్మోగిన రఫేల్‌ యుద్ధవిమానాల వ్యవహారం మరొకటి. రఫేల్‌ యుద్ధ విమనాల కొనుగోలు వ్యవహరాంలో ప్రధాని మోదీపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యల అంశం ఇంకొకటి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దీక్ష ప్రారంభించిన చంద్రబాబు

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ.. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు. విజయవాడలోని ధర్నాచౌక్‌లో ‘‘12 గంటల నిరసన దీక్ష’’కు దిగారు. రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఏపీలో ఆంగ్లానికి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ముక్తకంఠంతో ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయ్యారు. 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి అయిన ఆమెను సీఎస్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా సీఎస్‌గా ఆమె గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.

5. ఫిర్యాదులకు ప్రత్యేక సమయం

తెలంగాణలో ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు తహసీల్దారును కలవడం సాధ్యం కాదు. ఏదో ఒక ద్వారం నుంచి కార్యాలయానికి వెళ్లి వద్దామన్నా చెల్లదు. ఆవరణలో ఎవరేం చేస్తున్నారు? ఎవరొచ్చి వెళ్తున్నారనేది సీసీ కెమెరాల్లో నిక్షిప్తం చేస్తారు. ప్రజల నుంచి ఫిర్యాదులకు ప్రత్యేక సమయం కేటాయించనున్నారు. కార్యాలయాలకు పోలీసు భద్రతనూ కల్పించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ప్రతి పైసాకు లెక్కలు బయటపెట్టాలి

సమాచార హక్కు (స.హ) చట్టం కింద ప్రతీ ప్రభుత్వ శాఖ లేదా విభాగం, సంస్థ ఖర్చు పెట్టే నిధుల లెక్కలన్నింటినీ పక్కాగా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో ఆయా శాఖల వెబ్‌సైట్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స.హ చట్టం కింద ప్రభుత్వ సమాచారాన్ని ప్రజల ముందు ఎప్పటికప్పుడు ఉంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ తాజాగా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఫాస్టాగ్‌ లేకుంటే టోల్‌ తీస్తారు!

జాతీయ రహదారుల్లో ఫాస్టాగ్‌ లేకుండా రాకపోకలు సాగించే వాహనదారుల జేబులకు చిల్లే. చెల్లించాల్సిన మొత్తం కన్నా రెట్టింపు కట్టాల్సిందే. క్యూలో అధిక సమయం వేచి ఉండాలి. డిసెంబరు ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌(ఈటీసీ)విధానంలో టోల్‌ఛార్జీలు వసూలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. బొడ్డుతాడును వెంటనే కత్తిరించొద్దు

తల్లి ప్రసవించిన వెంటనే నవజాత శిశువు బొడ్డుతాడును కత్తిరించొద్దని, కనీసం 5 నుంచి 15 నిమిషాల వ్యవధినివ్వాలని రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వశాఖలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఈ వ్యవధి ఉండడం వల్ల బిడ్డ ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుందని పేర్కొంది. బొడ్డుతాడును కాసేపు ఉంచేస్తే, పుట్టిన మొదటి అయిదు నిముషాల్లోనే నవజాతశిశువు అదనంగా మరో 60శాతం ఎర్ర రక్తకణాలను పొందగలుగుతుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆధార్‌ చిరునామా మార్పు ఇక తేలిక

ఆధార్‌ కార్డుల్లో చిరునామాలు మార్చుకునేందుకు ఉన్న నిబంధనలను కేంద్రం సరళం చేసింది. వలసదారులు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి ఆధార్‌కార్డులో చిరునామాను మార్పు చేసుకోవచ్చు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది. పనిచేసే ప్రదేశం వివరాలతో ఆధార్‌లో చిరునామా మార్చుకోవచ్చు.

10. బంగ్లాతో తొలి టెస్టు నేటి నుంచే

టీ20ల్లో బంగ్లాదేశ్‌ విసిరిన సవాల్‌ను కాచుకుని సిరీస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. టెస్టుల్లో ఆ జట్టుకు పెను సవాల్‌ విసిరేందుకు సిద్ధమైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారం ఇండోర్‌లో ఆరంభం కానుంది. పొట్టి క్రికెట్లో కాస్త కాలం కలిసొచ్చి ఓ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన బంగ్లా పులులకు సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీసేనను ఎదుర్కోవడం మామూలు సవాలు కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.