close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. విలీన డిమాండ్‌ను పక్కన పెట్టాం: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అనంతరం  ఈయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని అరెస్టులు జరగలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. జగన్‌కు డబ్బుపై వ్యామోహం: చంద్రబాబు

రాష్ట్రంలో ఇసుక కొరత కృత్రిమమే తప్ప సహజమైనది కాదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతి అంశంలోనూ జే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని.. మద్యం నియంత్రించాల్సిన శాఖతోనే మద్యం అమ్మకాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షలో భాగంగా దీక్షా వేదికపై చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్‌కు డబ్బుపై వ్యామోహం ఎక్కువని.. బలవంతంగా ప్రజల ఆస్తులను రాయించుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. జగన్‌తో కలిసి నడుస్తా: ఎమ్మెల్యే వంశీ

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వానికి మద్దతిస్తానని, ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి నడుస్తానని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన వంశీ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, వైకాపాకు ఎందుకు మద్దతివ్వాల్సి వచ్చిందో వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. రూట్ల ప్రైవేటీకరణపై కేసీఆర్‌ సమీక్ష

రూట్ల ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, అదనపు అడ్వొ కేట్‌ జనరల్‌ రామచందర్‌రావు తదితరులు హాజరయ్యారు. రూట్‌ పర్మిట్లపై ఇచ్చిన స్టేను సోమవారం వరకు పొడిగించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. నా ఆరోగ్యం చాలా బాగుంది: కృష్ణం రాజు

తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను సీనియర్‌ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘కేవలం న్యూమోనియా చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్‌ పరీక్షల నిమిత్తం కేర్ ఆసుపత్రికి వెళ్లాను. అది చూసిన కొన్ని పత్రికల వారు విషయం తెలుసుకోకుండా వార్తలు రాశారు. ఇందువల్ల ఆసుపత్రిలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్‌ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్తాను’ అని కృష్ణం రాజు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. విజయవాడ రమేశ్‌ ఆస్పత్రికి గిన్నిస్‌ రికార్డు

విజయవాడలోని రమేశ్‌ హాస్పిటల్స్‌ గిన్నిస్‌ రికార్డుల్లోకి చేరింది. ఇప్పటివరకు 20వేల గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఈ ఘనతను సాధించింది. హాస్పిటల్‌ ఎండీ డా. పోతినేని రమేశ్‌బాబుకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు గిన్నిస్‌ రికార్డుకు సంబంధించిన ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం శస్త్రచికిత్సలు చేయించుకున్న 1,020 మంది రోగులను ఒకే వేదికపైకి చేర్చి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ను స్వీకరించింది. ఈ కార్యక్రమానికి సినీహీరో రామ్‌ పోతినేని హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. రవీంత్రభారతిలో బాలల దినోత్సవ వేడుకలు

8. శబరిమల ప్రవేశంపై ఆ తర్వాతే నిర్ణయం: సీఎం

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో న్యాయకోవిదులను తమ ప్రభుత్వం సంప్రదించనుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఏళ్లుగా ఉన్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ఇవాళ విచారణ సందర్భంగా శబరిమల అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. భారత పేసర్ల ధాటికి ‘బంగ్లా పులులు’ బెంబేలు

ఇండోర్‌ టెస్టులో భారత్‌ దుమ్మురేపింది. మ్యాచ్‌పై తొలి రోజే పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను టీమిండియా పేసర్లు 150 పరుగులకే పరిమితం చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌ 64 పరుగుల వెనుకంజలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మార్కెట్లోకి సరికొత్త హోండా ఎస్‌పీ 125

ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా భారత్‌లో సరికొత్త బైకును విడుదల చేసింది. హోండా సీబీ షైన్‌ ఎస్‌పీ 125 మోటార్‌ సైకిల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో దీని ధర రూ.72,900గా నిర్ణయించారు. భారత్‌ స్టేజ్‌-6 నిబంధనలకు అనుగుణంగా ఈ కొత్త బైకును రూపొందించారు. బీఎస్‌-6 నిబంధనలను అందుకున్న రెండో హోండా బైకుగా ఎస్‌పీ 125 నిలిచింది.  ఇప్పటికే హోండా యాక్టివా బైకు బీఎస్‌-6 నిబంధనలను అందుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.