
తాజా వార్తలు
కొత్తగా కారుకి ఓనరవడం ఎవరికైనా సంతోషమే. కానీ ప్రయాణం సాఫీగా సాగాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అందులో ఒకటి మన స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ఉపయుక్తమైన యాప్స్ వేసుకోవడం. ఫోన్లో ఇవి ఉంటే ఒక వ్యక్తిగత సహాయకుడు మన వెంట ఉన్నట్టే.
మ్యాప్ ఫ్యాక్టర్- దారి చూపుతుంది మనం వెళ్లాల్సినచోటుకి దారి చూపే నావిగేషన్ యాప్‌లకు కొదవ లేదు. మ్యాప్ ఫ్యాక్టర్ వీటికి భిన్నం. గతంలో ప్రయాణించిన మార్గాలు, ప్రయాణించాలనుకున్నవీ సేవ్ చేసుకోవచ్ఛు అంతేగాక ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా వాటిని ఉపయోగించుకోవచ్ఛు. |
ఫైండ్ మై కార్- కనిపెట్టేస్తుంది షాపింగ్‌మాల్, సినిమా థియేటర్‌లాంటి జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కారు నిలిపి ఉంచినప్పుడు కొన్నిసార్లు పార్కింగ్ చేసిన చోటుని మర్చిపోతుంటాం. అదే మన సెల్ఫోన్లో ‘ఫైండ్ మై కార్’ యాప్ ఉంటే.. గూగుల్ మ్యాప్ నావిగేషన్ ఆధారంగా ఫొటోలు తీసుకొని కారున్న చోటుని భద్రపరుస్తుంది. జీపీఎస్‌తో సమన్వయం చేస్తూ పార్కింగ్ ప్లేస్‌కి దారి చూపుతుంది. |
పార్కోపీడియా- స్థలం చూపిస్తుంది పదిహేనువేల నగరాల్లో ఫ్రీ, పెయిడ్‌కి సంబంధించి 6 కోట్ల పార్కింగ్ స్థలాల వివరాలు ఈ యాప్‌లో ఉన్నాయి. ఎక్కడెంత పార్కింగ్ ధర ఉందో కూడా చెబుతుంది. ఇది ఫోన్లో ఉంటే పెద్ద సమస్య నుంచి గట్టెక్కినట్టే. |
రాడార్బోట్- హెచ్చరిస్తుంది ఇది స్పీడ్ కెమెరా డిటెక్టర్, స్పీడోమీటర్. మన వాహనం ఎంత వేగంతో వెళ్తోందీ, ఫలానా ప్రాంతం దాటుతున్నప్పుడు ఎంత వేగంతో వెళ్లిందీ లెక్కగట్టి చెబుతుంది. టన్నెల్ కెమెరాలు, ఫిక్స్డ్ స్పీడ్ కెమెరాలు, మొబైల్ కెమెరాలు.. ఇలా ప్రతి కెమెరాని పసిగట్టి వివరాలు అందిస్తుంది. |
ట్యూరో- అద్దె తీసుకొస్తుంది ఇది కారు షేరింగ్ యాప్. ఖాళీ సమయాల్లో యజమాని తన కారుని ఈ యాప్ సాయంతో క్యాబ్‌లా మార్చేసుకోవచ్ఛు తాను వెళ్లే దారిలో ఎవరైనా ఉంటే ఎక్కించుకోవచ్ఛు అందుకు సంబంధించి అనుమతి పత్రాలు తప్పనిసరి. |
సింప్లీ ఆటో- మైలేజీ ఎంతో చెబుతుంది ఇది కార్ మేనేజ్మెంట్ యాప్. ఫ్యూయెల్ ట్రాకింగ్ చేస్తూ వాహనం మైలేజీ ఎంత ఇస్తుందో చెబుతుంది. నిర్వహణ, సర్వీసింగ్ తేదీలు గుర్తు చేస్తుంది. ట్రిప్ మీటర్, మరమ్మతుల వివరాలు, రాబోయే సర్వీసింగ్ తేదీలనూ గుర్తు చేస్తుంది. |
వేజ్- గూగుల్‌కి ప్రత్యామ్నాయం గూగుల్ మ్యాప్స్‌కి ప్రత్యామ్నాయం. నావిగేషన్ యాప్. వెళ్లబోయే మార్గంలో ట్రాఫిక్ సిగ్నళ్లు, పెట్రోల్ స్టేషన్లు, రోడ్డు అడ్డంకులు, బ్యాంకులు, ఆసుపత్రులు.. ఇలా వివరాలన్నీ చూపిస్తుంది. |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
