
తాజా వార్తలు
ప్రమాదవశాత్తు రైలు కింద పడి యువతి దుర్మరణం
రఘునాథపల్లి, న్యూస్‌టుడే: రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువతి దుర్మరణం చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి రైల్వే గేటు సమీపంలో చోటు చేసుకుంది. కాజీపేట రైల్వే ఎస్సై జితేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన కోటు మనోహర్ కూతురు అనూష (20) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తాను అమ్మను చూసేందుకు వస్తున్నానంటూ తండ్రికి చరవాణిలో చెప్పి బుధవారం రాత్రి సికిందరాబాద్ నుంచి రైలులో బయలుదేరింది. రఘునాథపల్లి రైల్వేస్టేషన్ దాటాక అర్ధరాత్రి ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడిపోయింది. రైలు పట్టాలపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృత దేహం అవయవాలు ఎగిరిపడి చెల్లాచెదురయ్యాయి. రైల్వే సిబ్బంది గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై జితేందర్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వద్ద ఉన్న ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా ఆచూకీని తెలుసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులకు చరవాణిలో సమాచారం చేరవేశారు. దీంతో వారు కాజీపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంపై తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: లక్ష్మణ్
- బురద చల్లేందుకే ‘రౌండ్‌టేబుల్’:అంబటి
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
