
తాజా వార్తలు
అహ్మదాబాద్: ఓ స్టార్ హోటల్లో రెండు అరటిపండ్లకు వందల్లో బిల్లు వేసిన ఘటన గుర్తుంది కదా.. అలాంటి నిర్వాకమే మరో స్టార్ హోటల్లో చోటుచేసుకుంది. అయితే వీరు మూడు కోడిగుడ్లకు వేలల్లో బిల్లు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ రావ్జియాని గురువారం గుజరాత్ అహ్మదాబాద్‌లోని హయత్ రీజెన్సీ స్టార్ హోటల్లో మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లతో భోజనం ఆర్డర్ ఇచ్చారు. భోజనం చేసిన అనంతరం బిల్లు చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే మూడు కోడిగుడ్ల ధర రూ.1672లుగా ఉంది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్లో తెలిపారు. ఆ బిల్లులో మూడు ఉడికించిన కోడిగుడ్లకు రూ.1350, సర్వీస్ ఛార్జీగా రూ.67, సీజీఎస్టీ రూ.127, ఎస్జీఎస్టీ 127.. మొత్తం బిల్లు రూ.1672లుగా ఉంది. శేఖర్ బిల్లుతో సహా ట్విట్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
గత జులైలో నటుడు రాహుల్ బోస్‌కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. చండీగఢ్‌లోని ఓ హోటల్లో ఆయనకు రెండు అరటి పండ్లకు గానూ రూ.442ల బిల్లును హోటల్ సిబ్బంది అందించారు. దీనిని ఆయన అప్పట్లో ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎక్సైజ్ అండ్ టాక్సెషన్ డిపార్ట్మెంట్ ఆ హోటల్‌కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
