close

తాజా వార్తలు

నిమ్స్‌లో నర్సుల ఆందోళన

హైదరాబాద్‌: పదోన్నతుల విషయంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిమ్స్‌లో స్టాఫ్ నర్సులు, హెడ్‌నర్సులు ఆందోళన చేపట్టారు. ఆయన్ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పదోన్నతి రాకపోవడంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన స్టాఫ్‌నర్సు నిర్మలకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు నిమ్స్‌ సంచాలకులు మనోహర్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా వినతిపత్రం సమర్పించారు. సమస్యలను పరిష్కరిస్తామని మనోహర్‌ వారికి భరోసా ఇచ్చారు. నిర్మల పదోన్నతి కేసు న్యాయస్థానం విచారణ పరిధిలో ఉందని, కోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.