
తాజా వార్తలు
అనంతపురం నేరవార్తలు: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ శాఖలో సహాయ ఇంజినీర్‌గా పని చేస్తున్న సురేశ్‌రెడ్డి ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో నాలుగు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. అనంతపురంలోని సురేశ్‌రెడ్డి ఇంట్లో, ఆయన భార్య పుట్టినిల్లు కర్నూలు జిల్లా బేతంచర్లలో, పుట్టపర్తిలోని మరో రెండు చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.5 లక్షల నగదు, 300 గ్రాముల బంగారు నగలు, వాణిజ్య సముదాయ భవనం, వ్యవసాయ భూములు, నివాస స్థలాలను గుర్తించారు. వీటన్నింటి విలువ దాదాపు రూ.4 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సురేష్‌రెడ్డి 1991లో ఆయన తండ్రి మరణించడంతో కారుణ్య నియామకాల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో ట్రేసర్‌గా చేరారు. అనంతరం పదోన్నతిపై డ్రాఫ్ట్‌మెన్, ఏఈ, ఏఈఈ గా పదోన్నతులు పొందారు. ఆయన ఆస్తులను ప్రభుత్వ రికార్డుల మేరకు రూ.4.02 కోట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ రూ.40 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ దాడుల్లో సీఐలు చక్రవర్తి, సూర్యానారాయణ, ఖాధర్ బాషా, గౌతమి, శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- సినిమా పేరు మార్చాం
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- మరోసారి నో చెప్పిన సమంత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
