close

తాజా వార్తలు

‘సరి-బేసి’ పొడిగించేది లేదు: కేజ్రీవాల్‌


దిల్లీ: నగరంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని దిల్లీ ప్రభుత్వం నవంబర్‌ 4 నుంచి ప్రారంభించిన సరి-బేసి విధానాన్ని ఇంకా పొడిగించేది లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. నేటితో ఈ విధానం ముగుస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాతావరణ శాఖ తెలిపిన దాన్ని బట్టి 2-3 రోజుల్లో గాలి కాలుష్యం మామూలు స్థితికి వచ్చే సూచనలు ఉన్నాయన్నారు. అందువల్ల ఇంకా సరి-బేసి విధానాన్ని ఉంచి అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం అవుతుందని ఆయన తెలిపారు. దీన్ని కొనసాగించాలా?వద్దా? అనేదానిపై సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.