
తాజా వార్తలు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చిట్టినగర్, న్యూస్టుడే
ఏమైందో ఏమో.. ఓ తమ్ముడు తన అన్నయ్యకు వాట్సప్ సందేశం పంపి.. తాను ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూరాకుల రమేష్(40), తన తల్లితో కలిసి విద్యాధరపురం, వెంకటేశ్వరస్వామిగుడి వీధిలో నివాసం ఉంటున్నాడు. అతనికి వివాహం కాలేదు. రియల్ ఎస్టేట్ దళారిగా పనిచేస్తుంటాడు. ఎన్నిమార్లు వివాహం చేసుకోమని చెప్పినా చేసుకోలేదు. ఈనెల 12వ తేదీన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అమ్మను మీ దగ్గర ఉంచుకోమని, నేను ఎవరికి భారంగా ఉండకూదని బాధపడ్డాడు. 15వ తేదీన అన్నయ్య లీలాప్రసాద్ చరవాణికి వాట్సప్ మేసేజ్ వచ్చింది. దానిలో ‘‘అన్నయ్యా నా ద్విచక్రవాహనం వైవీరావ్ ఎస్టేట్ పైపులరోడ్డులో కుడి వైపున ఉంది. దానిని కలెక్ట్ చేసుకో. వెరీ సారీ, అమ్మ, విజయ అక్క జాగ్రత్త’’ అని ఉంది. లీలాప్రసాద్ అతని మరో అన్నయ్య నాగేశ్వరరావు వాట్సాప్ మెసేజ్ ప్రకారం వెళ్లి చూడగా వాహనం కనిపించింది. మరికొంత దూరం వెళ్లి పరిశీలిస్తే అమ్ముడు రమేష్ కాలిన గాయాలతో చనిపోయి ఉన్నాడు. ఆ పక్కన పెట్రోలు తీసుకు వచ్చిన ఖాళీ సీసా, అగ్గిపెట్టె, కాలిన చెప్పులు ఉన్నాయి.. 2వ పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సెక్టార్ ఎస్.ఐ. శేఖర్ ఘటనా ప్రాంతానికి వెళ్లారు. శవపంచనామా నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- కిల్లర్ శ్రీనివాస్నూ చంపేయండి!
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఘటనా స్థలికి రానున్న ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
