
తాజా వార్తలు
దిల్లీ: రాజకీయాలకు ఇది సమయం కాదనీ.. అంతా కలిసికట్టుగా పనిచేసి వాయు కాలుష్యాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్య తీవ్రత ప్రజలను ఊపిరాడనీయకుండా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాజకీయాలకతీతంగా అంతాకలిసి కట్టుగా పనిచేసి ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ను సీఎం కోరారు. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధానికి వ్యతిరేకంగా ‘చౌకీ దార్ చోర్ హై’ నినాదానికి కేజ్రీవాల్ మద్దతు పలికారని.. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ జావడేకర్ ట్విటర్లో చేసిన డిమాండ్‌పై దిల్లీ సీఎం పైవిధంగా స్పందించారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వాలు కలిసి పనిచేసి.. రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్ ట్విటర్లో కోరారు. ఇప్పటికే దిల్లీ సర్కార్, ప్రజలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారన్న సీఎం.. ఇందుకు జావడేకర్ కూడా మద్దతు ఇవ్వాలని కోరారు.
రఫేల్ వ్యవహారంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను కొట్టివేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రంపై కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేయడాన్ని నిరసిస్తూ దిల్లీ భాజపా నేతలు ఆప్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మరోవైపు, దిల్లీలో శనివారం వాయు కాలుష్య తీవ్రత కాస్త తగ్గినప్పటికీ ప్రమాదకర స్థాయి కొనసాగుతోంది. కాలుష్య తీవ్రతను నియంత్రించేందుకు దిల్లీ ప్రభుత్వం చేపట్టిన సరి-బేసి విధానం ఈ నెల 15 వరకు కొనసాగింది. అయితే, దీన్ని మళ్లీ తీసుకొచ్చే ఉద్దేశం లేదన్న సీఎం.. ఈ నెల 18న జరిగే సమావేశంలో పొడిగించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే: వెంకటేష్
- ‘నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామ’
- వాట్సప్‌లో కాల్ వెయిటింగ్ ఫీచర్
- శోభన్‌బాబుగా విజయ్ దేవరకొండ..?
- అలా స్టేటస్లు పెట్టుకోవడం చూసి బాధపడ్డా
- ‘అతినిద్ర లక్షణాలు ఇవే’..!
- ఎన్టీఆర్ తీరని కోరిక!
- గతం గతః అంటున్న రాహుల్.. శ్రీముఖి
- వెంకీ డైలాగ్: రాశీ-పాయల్ టిక్‌టాక్..!
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
