
తాజా వార్తలు
ముంబయి: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయ దుందుభి మోగించింది. ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. మయాంక్ అగర్వాల్ రెండో ద్విశతకం బాదగా బంతితో మహ్మద్ షమి అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3/27, రెండో ఇన్నింగ్స్‌లో 4/31 గణాంకాలు నమోదు చేశాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఫామ్ ప్రకారం మహ్మద్ షమి అత్యుత్తమ బౌలరని దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ అంటున్నాడు. ట్విటర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం మహ్మద్ షమిపై ప్రశంసలు కురిపించారు. అతడు పరుగెడుతుంటే వేట కోసం చిరుత పరుగెడుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. ‘మహ్మద్ షమి బంతి విసిరేందుకు పరుగెడుతుంటే స్పైడర్ కెమెరాలోంచి ఆ షాట్ తీస్తే చూడ్డానికి ఎంత బాగుంటుందో. దాదాపు వేట కోసం చిరుత పరుగెడుతున్నట్టు అనిపిస్తుంది. అతడి సీమ్, మణికట్టు పొజిషన్ చాలా బాగుంది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసేందుకు చేతివేళ్లను వినియోగిస్తున్న విధానం అద్భుతం. ఈ నైపుణ్యం కోసం అతడెంతో సాధన చేశాడు’ అని గావస్కర్ అన్నారు. ఈ సీజన్లో షమి ఇప్పటి వరకు 68 వికెట్లు తీయడం ప్రత్యేకం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
