
తాజా వార్తలు
హైదరాబాద్: కోర్టులు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వైఖరిలో ఏమాత్రం మార్పు లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏం తెలుసని ప్రశ్నించారు. ఆయన ఎండీగా బాధ్యతలు చేపట్టి కేవలం 17 నెలలు మాత్రమే అయ్యిందన్నారు. కనీసం ఏడు సార్లు కూడా కార్యాలయానికి రాలేదని, దీంతో ఫైళ్లు కుప్పలుగా పేరుకుపోయాయని ఆరోపించారు. ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ రాజకీయ నాయకులు సమర్పించిన అఫిడవిట్లా ఉందని దుయ్యబట్టారు.
సమ్మె వల్ల సంస్థ నష్టపోలేదని, ప్రభుత్వ విధానాల వల్లే నష్టపోయిందని అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మె లేనప్పుడు నష్టం వస్తుందని చెప్పిన ఎండీ.. సమ్మె జరుగుతుంటే నష్టం వస్తోందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సమ్మె చట్టబద్ధమా? విరుద్ధమా?అనేది కోర్టు తేలుస్తుందని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్‌పై ఎండీ సునీల్ శర్మ సంతకం పెడుతున్నారని, హైకోర్టుకు సమర్పించింది ఫక్తు రాజకీయ అఫిడవిటేనని అశ్వత్థామ ఆరోపించారు.
ఇదీ చదవండి..
సమ్మె చట్ట విరుద్ధమే: ఆర్టీసీ యాజమాన్యం
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
