
తాజా వార్తలు
వరంగల్: హన్మకొండలో తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిగుడ్డును ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చిన ఘటనలో దోషికి హైకోర్టు శిక్ష తగ్గించింది. న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువడించింది. వివరాల్లోకి వెళితే.. పోలెపాక ప్రవీణ్ అలియాస్ పవన్ (25) అనే యువకుడు వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలో కూలి పనులు చేస్తూ.. ఈ ఏడాది జూన్ 18న అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ ఇంటి డాబాపైకి ఎక్కి నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని అపహరించాడు. అనంతరం పసిపాపను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప ఏడవడంతో నోరు, ముక్కు మూసి హతమార్చాడు. ఈ సంఘటన ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణం తెలియగానే వరంగల్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిందితుడిని ఉరి తీయాల్సిందేనని నినదించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేశారు. నిందితుడిపై అపహరణ, అత్యాచారం, హత్య తదితర నేరాలతోపాటు లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసులు నమోదు చేశారు. 51 మంది సాక్షుల్లో 30 మందిని విచారించారు. కోర్టులో 20 పేజీల నేరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక న్యాయస్థానం 48 రోజుల్లోనే ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఈ దుర్మార్గానికి పాల్పడిన ప్రవీణ్‌కు ఉరేసరి అని న్యాయమూర్తి కె.జయకుమార్ సంచలన తీర్పు వెల్లడించారు. కాగా ఈ తీర్పును సమీక్షించిన హైకోర్టు నిందితుడు ప్రవీణ్‌కు శిక్ష తగ్గించింది. తుదిశ్వాస విడిచే వరకు ప్రవీణ్‌ను జైల్లోనే ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
