
తాజా వార్తలు
యంత్రంలో చిక్కుకుని ఊడిన కార్మికురాలి జుట్టు.. పరిస్థితి విషమం
బొమ్మలరామారం, న్యూస్టుడే: సాధారణంగా వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పిందని చెబుతుంటారు. కానీ, శిరోజాలే ప్రమాదానికి కారణమైన అనూహ్య విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలోని ఓ పరిశ్రమలో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికురాలి తల వెంట్రుకలు, చెవుల వద్ద చర్మం ఊడిపోయి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తోటి కార్మికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మల రామారంలో డిటోనేటర్లకు వినియోగించే ముడి సరుకు తయారీ పరిశ్రమ (ఓం సాయి లక్ష్మీనర్సింహ వర్క్స్)లో పని చేస్తున్న భువనగిరి ఈశ్వరమ్మ రోజులాగే పనికి వచ్చారు. పనిచేస్తున్న క్రమంలో జడ యంత్రంలోని ఇనుప చక్రాల్లో చిక్కుకోవడంతో వెంట్రుకలు, చెవుల వద్ద చర్మం ఊడిపోయాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో యాజమాన్యం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ఈశ్వరమ్మకు భర్త, నలుగురు పిల్లలున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బొమ్మలరామారం ఎస్సై మధుబాబు తెలిపారు. పరిశ్రమలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాధితురాలికి యాజమాన్యం వైద్యం అందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
