close

తాజా వార్తలు

కోహ్లీ జోరు: లంచ్‌కు టీమిండియా 289/4

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చారిత్రక డే/నైట్‌ టెస్టులో టీమిండియా భారీ స్కోరువైపు పయనిస్తోంది. రెండోరోజు, శనివారం భోజన విరామానికి 4 వికెట్లు నష్టపోయి 289 పరుగులు చేసింది. శతకం సాధించిన సారథి విరాట్‌ కోహ్లీ (130; 187 బంతుల్లో 17×4) జోరుమీదున్నాడు. దూకుడుగా ఆడుతున్నాడు. అతడికి రవీంద్ర జడేజా (12; 39 బంతుల్లో) తోడుగా ఉన్నాడు. కేవలం ఒక సెషన్‌ (30 ఓవర్లు)లోనే టీమిండియా 115 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లాపై 183 పరుగుల ఆధిక్యంలో ఉంది. అర్ధశతకం బాదిన అజింక్య రహానె (51; 69 బంతుల్లో 7×4) జట్టు స్కోరు 236 వద్ద ఔటయ్యాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.