close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం

అనూహ్య పరిణామాల అనంతరం నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. తొలుత ప్రొటెం స్పీకర్‌ కాళిదాస్‌ కొలంబకర్‌ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అనంతరం సభ్యులు స్పీకర్‌ని ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్‌గా భాజపా ఎమ్మెల్యే(వడాలా) కాళిదాస్‌ కొలంబకర్‌ను గవర్నర్‌ కోశ్యారీ మంగళవారం నియమించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మరికొద్దిసేపట్లో ... నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి47

పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి47 ప్రయోగానికి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే బుధవారం ఉదయం 9.28 గంటలకు ఇది నింగిలోకి దూసుకెళ్లనుంది. అనంతరం 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి

సమ్మె విరమించిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని విపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని.. లేదంటే ప్రజాక్షేత్రంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు నిరంతరం అండగా ఉంటామని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. వచ్చేనెల 20నాటికి నవశకం

వైఎస్‌ఆర్‌ నవశకం సర్వేలో గుర్తించిన లబ్ధిదారుల జాబితాలను వచ్చే నెల 15 నుంచి 18 వరకు, ఎంపిక చేశాక తుది జాబితాలను డిసెంబరు 20నాటికి అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి జనవరి 1 నుంచి కొత్త కార్డుల ముద్రణ, పంపిణీ మొదలుకావాలన్నారు. వచ్చే నెల 21నాటికి మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్‌ఆర్‌ నేతన్న హస్తం కింద రూ.24 వేల సాయం అందిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మూసీ కాలుష్యంపై కదిలిన హైకోర్టు

మూసీ కాలుష్యంపై పదే పదే వ్యాఖ్యలు చేయడంతోపాటు పలు సూచనలు, ఆదేశాలిస్తున్న తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం మూసీపై ‘ఈనాడు’ కథనాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ శాఖ, పురపాలక తదితర శాఖ కార్యదర్శులతోపాటు, హైదరాబాద్‌ పరిసర జిల్లాల కలెక్టర్లను పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 2021 జూన్‌ నాటికి పోలవరం పూర్తి

రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా రూ. వెయ్యి కోట్లు ఆదా అయ్యిందని, ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే రూ.850 కోట్లు మిగిలిందని ఏపీ జల వనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. 2020 జూన్‌ నాటికి స్పిల్‌వే, గేట్ల బిగింపు పూర్తి చేస్తామన్నారు. 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నీరు విడుదల చేస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పరుల సొమ్ము ఆశించరాదు

సుదీర్ఘ కసరత్తు తరవాత లోక్‌పాల్‌కు లోగోను (చిహ్నం), లోక్‌పాల్‌ లక్ష్యాన్ని తెలియజెప్పేలా నినాదాన్ని మంగళవారం ఖరారు చేశారు. ప్రజల నుంచి లోగో డిజైన్లను ఆహ్వానించగా అలహాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ మిశ్ర రూపొందించిన లోగోను ఎంపిక చేశారు. అయితే నినాదం కోసం వచ్చిన ఎంట్రీల్లో ఏవీ అర్హమైనవిగా లేకపోవడంతో లోక్‌పాల్‌ పూర్తి ధర్మాసనం సొంతంగా ఉపనిషత్తు నుంచి ఒక శ్లోకాన్ని నినాదంగా ఎంపిక చేసింది. ‘పరుల సొమ్ము ఆశించరాదు’ అన్నది ఈ శ్లోకం సారాంశం.

8. దేశంలో 10% తగ్గిన అవినీతి

దేశంలో గత ఏడాది కాలంలో అవినీతి 10% మేర తగ్గిందని ఒక సర్వేలో వెల్లడయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా (టీఐఐ), లోకల్‌ సర్కిల్స్‌ సంస్థలు కలిసి దీనిని నిర్వహించాయి. అవినీతి సూచీలో 2018తో పోలిస్తే మన దేశం ర్యాంకింగ్‌ మూడు స్థానాలు మెరుగుపడిందని, 180 దేశాల్లో 78వ స్థానంలో నిలిచిందని టీఐఐ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అప్పిచ్చే ముందే స్థోమత చూడండి

ముద్రా రుణాల్లో మొండి బకాయిలు పెరుగుతుండటంపై బ్యాంకులను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు ఎం.కె.జైన్‌ హెచ్చరించారు. ఈ రుణాలను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తుండాలని సూచించారు. ఫలానా వ్యక్తి లేదా సంస్థకు రుణాన్ని తిరిగి చెల్లించే స్థోమత ఉందా లేదా అని రుణం ఇవ్వడానికి ముందే బ్యాంకులు అంచనా వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ‘అర్జున్‌ సురవరం’ ప్రీ రిలీజ్‌ వేడుక


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.