close

తాజా వార్తలు

ఏపీలో మీడియం మార్పుపై జోక్యం చేసుకోండి

రాజ్యసభలో ప్రస్తావించిన జీవీఎల్‌, కనకమేడల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెదేపా సభ్యుడు కనకమేడల రవీందర్‌, భాజపా సభ్యుడు జీవీఎల్‌ కోరారు. రాజ్యసభ శూన్యగంట సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలుగు మీడియంలో చదివిన వారు కూడా ఆ తరువాత ఆంగ్లంలో ప్రావీణ్యం పొందారని సభకు గుర్తు చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని మాతృభాషకు ప్రధాన్యమిచ్చేలా ఏపీకి సూచించాలని జీవీఎల్‌ కోరారు. 

ఈ మేరకు రాష్ట్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవరించుకునేలా కేంద్రం ఆదేశాలివ్వాలని ఎంపీ కనకమేడల కోరారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.