close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. తెలంగాణ ఆర్టీసీ డిపోల వద్ద సందడి

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల 52 రోజుల సమ్మె తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద పండగ వాతావరణం నెలకొంది. కార్మికులంతా ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరవచ్చంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో వారంతా ఉదయం నుంచే డిపోలకు చేరుకుంటున్నారు. షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకోవడం సంతోషకరమని, సంస్థను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామని వారు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. 9 మంది విద్యార్థులు అదృశ్యం.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ నారాయణ కళాశాల నుంచి 9 విద్యార్థులు అదృశ్యమయ్యారు. గురువారం రాత్రి వసతి గృహం నుంచి మహబూబ్‌నగర్‌కు చెందిన 9 మంది విద్యార్థులు అదృశ్యమయ్యారని కళాశాల సిబ్బంది తెలిపారు. వీరిలో ఆరాంఘర్‌ చౌరస్తా వద్ద ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. రాజేంద్రనగర్‌లోని స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కళాశాలకు వెళ్తుండగా.. వీరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మున్సిపల్‌ ఎన్నికలపై నేడు ఉత్తర్వులు

మున్సిపల్‌ ఎన్నికలపై వివాదాలకు దాదాపుగా తెరపడనుంది. వార్డుల విభజనకు జులై 7న జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవడానికి సిద్ధమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు అంగీకరించిన పిటిషనర్ల పిటిషన్లపై శుక్రవారం ఉత్తర్వులు వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. మొదట పంచాయతీ పోరే

ఏపీలో మొదటిదశలో పంచాయతీ, రెండోదశలో మండల-జిల్లా పరిషత్తు, మూడోదశలో పురపాలికలకు ఎన్నికలు నిర్వహించేలా వేర్వేరుగా ప్రకటనలు (నోటిఫికేషన్లు) జారీ కానున్నాయి. అన్నింటికీ కలిపి రెండుదశల్లో నిర్వహించాలని తొలుత భావించినా హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలకు మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఒక్కో విద్యార్థిపై రూ.50,359 ఖర్చు

తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై సగటున ఏడాదికి రూ.50,359లు ఖర్చు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు కట్టింది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు, గణాంకాలను విద్యాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. దోమల కు.నియంత్రణ!

దోమలకు ‘కుటుంబ నియంత్రణ’.. కొద్ది కాలంగా వినిపిస్తున్న ఈ ప్రక్రియపై ప్రయోగాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిద్ధమవుతోంది. అంటువ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా మగ దోమల్లో ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని నిర్మూలించేందుకు, కొత్త రేడియేషన్‌ విధానాన్ని పరీక్షించడానికి ఏర్పాట్లు చేస్తోంది. సిట్‌ (స్టెరైల్‌ ఇన్‌సెక్ట్‌ టెక్నిక్‌)గా పిలిచే ఈ సాంకేతిక ప్రక్రియను దశలవారీగా పరిశీలించనుంది. ‘సిట్‌’ విధానం ఇప్పటికే పంటలను పాడు చేస్తున్న, పశువ్యాధులకు కారణమవుతున్న క్రిమి కీటకాలపై విజయవంతమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ప్రాంతీయ మీడియా మాతృభాషను ప్రోత్సహించాలి

వార్తలు అందించడంతో పాటు తమ మాతృభాషకు సరైన ప్రోత్సాహం కల్పించడాన్ని ప్రాంతీయ మీడియా సంస్థలు బాధ్యతగా భావించాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. స్థానిక భాషను, సంస్కృతి-సంప్రదాయాలను ప్రోత్సహించాలని సూచించారు. దిల్లీలో గురువారం నిర్వహించిన ఇండియన్‌ ఉమెన్‌ ప్రెస్‌ కోర్‌ (ఐడబ్ల్యూపీసీ) రజతోత్సవంలో ఆయన ప్రసంగించారు. మహిళలకు భద్రత, గౌరవం కల్పించడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలే కాకుండా మీడియా కృషి చేయాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. చిట్‌ ఫండ్స్‌ సవరణ బిల్లుకు ఆమోదం

చిట్‌ ఫండ్స్‌ సవరణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిని గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించగా, లోక్‌సభ ఈ నెల 20నే అంగీకారం తెలిపింది. దీని ప్రకారం ఖాతాదార్లు బకాయి పడితే అంతవరకు జమయిన మొత్తం నుంచి స్వాధీనం చేసుకొనే అధికారం యజమానికి ఉంది. చిట్‌ఫండ్‌లకు మరింత గౌరవం కల్పించడం కోసం ‘సౌభ్రాతృత్వ నిధి’ (ఫ్రెటర్నిటీ ఫండ్‌) ‘చక్రీయ పొదుపు’ (రొటేటింగ్‌ సేవింగ్స్‌), ‘రుణ సంస్థ’ (క్రెడిట్‌ ఇన్‌స్టిట్యూట్‌) అన్న పదాలు చేర్చినట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మందుల ధరలకు కళ్లెం!

దేశవ్యాప్తంగా మందుల ధరలు గణనీయంగా దిగిరానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధాల్లో దాదాపు 80 శాతం ఔషధాల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు షెడ్యూలు జాబితాలో (నాన్‌-షెడ్యూల్డ్‌) లేని ఔషధాలపై 30 శాతం లాభాలతో సరిపెట్టుకుంటామని ఔషధ పరిశ్రమ తయారీదార్లు, పంపిణీదార్లు అంగీకారానికి రావటం ఇందుకు వీలుకల్పిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఆసియా స్వర్ణం.. ఒలింపిక్‌ బెర్తు

భారత స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి సత్తా చాటింది. ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలవడమే కాక.. టోక్యో ఒలింపిక్స్‌ బెర్తూ సంపాదించింది. సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్‌, సౌరభ్‌వర్మ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.