close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. తెదేపా నేత అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం

తెదేపా సీనియర్‌ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా నక్కపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్పగాయమైంది. వెంటనే ఆయనకు నక్కపల్లిలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మరో ఘోరం

హైదరాబాద్‌ శివారులో మరో ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు రింగురోడ్డుపై తిరుగుతూనే ఉన్నారు. అయినా మరో మహిళ చావు కేక గాలిలో కలిసిపోయింది. బుధవారం రాత్రి యువ పశువైద్యురాలిపై కిరాతకాన్ని మరవకముందే.. ఆ ప్రాంతానికి కిలోమీటరు దూరంలోనే మరో మహిళ శవం సగం కాలిన స్థితిలో దొరకడం తీవ్ర అలజడి కలిగించింది. హత్యా? ఆత్మహత్యా? అనేది ఇంకా తేలకున్నా పరిస్థితులు మొన్నటి సంఘటనను తలపిస్తుండడం నగరంలో కలకలం సృష్టిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఫాస్టాగ్‌ గడువు పెంపు

వాహనదారులకు మరింత సమయం ఇచ్చేందుకు ఫాస్టాగ్‌ విధానం అమలు గడువును మరో 15 రోజులపాటు పొడిగించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ట్యాక్స్‌ను ఎలక్ట్రానిక్‌ టాక్స్‌ కలెక్షన్‌ విధానాన్ని అమలు చేసేందుకు ఫాస్టాగ్‌ విధానాన్ని కేంద్రం రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఉద్ధవ్‌ సర్కార్‌కు నేడు బలపరీక్ష

శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలో ఏర్పడ్డ ‘మహా వికాస్‌ అఘడీ’ సంకీర్ణ ప్రభుత్వ బల నిరూపణకు ముహూర్తం ఖరారైంది. శాసనసభలో శనివారం మధ్యాహ్నం బలపరీక్ష ఉంటుందని విధానసభ అధికారులు వెల్లడించారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్‌ఠాక్రే శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్సీపీ-కాంగ్రెస్‌లు మద్దతు ఇస్తుండటం వల్ల సభలో బలనిరూపణ లాంఛనమేనని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. యథావిధిగా ఆర్టీసీ సేవలు

సుదీర్ఘ కాలం తరువాత శుక్రవారం టీఎస్ఆ‌ర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో రోడ్లపైకి వచ్చాయి. డిపోల వద్ద సందడి కనిపించింది. రిజర్వేషన్‌ సేవలు ప్రారంభమయ్యాయి. సమస్య పరిష్కారం కోసం 55 రోజులుగా కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. సమ్మె విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించిన మూడు రోజుల తరువాత విధుల్లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతించటంతో సిబ్బందిలో ఆనందం వెల్లివిరిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మందుబాబులకు ముకుతాడు

హైదరాబాద్‌లో తాగుబోతులకు పోలీసులు ముకుతాడు వేయబోతున్నారు. తప్ప తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడినా..వారి డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేయబోతున్నారు. దీంతోపాటు అతివేగంగా డ్రైవింగ్‌ చేసే వారి లైసెన్సులపైనా వేటుపడబోతోంది. అనేకమార్లు అతివేగంగా కారు నడిపిన సినీనటుడు రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్సును సైతం రద్దుచేయించాలని పోలీసులు నిర్ణయించారు. గత రెండు నెలల్లో 3000 మంది తాగి వాహనం నడిపి పట్టుబడగా వారి లైసెన్సు రద్దుచేయాలని రవాణాశాఖకు లేఖలు రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. నాలుగేళ్ల డిగ్రీ.. ఐదేళ్ల బీటెక్‌

డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగార్హతలు, అందుకు కావల్సిన నైపుణ్యాలు కల్పించే దిశగా ఏపీ ఉన్నత విద్యామండలి అడుగులు వేస్తోంది. ఇందుకోసం వచ్చే ఏడాది నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలు నాలుగేళ్లు, ఇంజినీరింగ్‌ ఐదేళ్ల కోర్సులు కానున్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఏడాది అప్రెంటిస్‌షిప్‌ చేయాలనే నిబంధనను ఉన్నత విద్యాశాఖ తీసుకురాబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. శ్రీలంకకు భారీ సాయం

భారత్‌-శ్రీలంకల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘చాలా ఉన్నత స్థాయి’లో ఉండేలా కృషి చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స అన్నారు. భారత్‌లో పర్యటిస్తున్న ఆయన ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భద్రత రంగంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. శ్రీలంకకు 450 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 3,229 కోట్ల)  సులభతర రుణం (లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌) ఇవ్వనున్నట్టు మోదీ ప్రకటించారు. ఇందులో తీవ్రవాద నిర్మూలనకు 50 మిలియన్‌ డాలర్లు (రూ.358 కోట్లు) కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. పసిడి స్వచ్ఛతకు భరోసా

బంగారంతో చేసే ఆభరణాలు, కళాకృతులకు హాల్‌మార్కింగ్‌ 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ తయారు చేసినా, విక్రయించినా హాల్‌మార్కింగ్‌ ఉండాల్సిందే. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ వచ్చే జనవరి 15న విడుదల చేస్తామని, పూర్తిస్థాయి అమలుకు ఏడాది గడువు ఇస్తామని కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశవాన్‌ శుక్రవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 6 బంతుల్లో 5 వికెట్లు

పేసర్‌ అభిమన్యు మిథున్‌ సంచలనం సృష్టించాడు. 6 బంతుల్లో 5 వికెట్లు తీసి టీ20ల్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం కర్ణాటక తరఫున ముస్తాక్‌ అలీ టోర్నీ సెమీఫైనల్లో హరియాణాపై అభిమన్యు ఈ ఫీట్‌ సాధించాడు. మరోవైపు పాకిస్థాన్‌తో డేవిస్‌కప్‌ పోరును భారత్‌ ఘనంగా ఆరంభించింది. తిరుగులేని ఆధిపత్యంతో 2-0 ఆధిక్యం సంపాదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.