close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ల్యాండర్‌ విక్రమ్‌ జాడను కనుగొన్న నాసా

చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలోకి వెళ్లి కూలిన చంద్రయాన్-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ జాడను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కనిపెట్టింది. నాసాకు చెందిన లూనార్‌ రీకనైసాన్స్‌ ఆర్బిటర్‌(ఎల్‌ఆర్‌వో).. విక్రమ్‌ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది. ఈ మేరకు చిత్రాలను తీసి పంపింది. విక్రమ్ శకలాలు దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రెండు డజన్ల ప్రదేశాల్లో పడ్డట్లు గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం మదనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నడిరోడ్డుపై పడి ఉన్న బస్సును తొలగిస్తుండగా క్రేన్‌ కూడా బోల్తాపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. చట్టాల దిశ మార్చండి!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం రాత్రి దిల్లీకి చేరారు. మంగళవారం ప్రధానిని కలిసేందుకు సమయం కోరారు. అనుమతి లభిస్తే.. కార్యాలయంలోగానీ, పార్లమెంటులోగానీ కలిసే వీలుంది. ఈ సందర్భంగా ‘దిశ’ హత్యాచార ఉదంతం నేపథ్యంలో చట్టాల్లో మార్పులు చేసి కఠిన శిక్షల అమలుకు కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరనున్నారు. అలాగే విభజన హామీలు, ఆర్టీసీ పరిణామాలను వివరించొచ్చని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఏపీఎస్‌ఆర్టీసీ విభజనకు ప్రతిపాదనేదీ రాలేదు

ఏపీఎస్‌ఆర్టీసీ విభజనకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర రహదారి, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీ తెలిపారు. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ అంగీకారం లేదు. రహదారి రవాణా సంస్థల చట్టం 1950లోని సెక్షన్‌ 3కింద ఉన్న అధికారాలను ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేసింది’ అని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రూ.20కే ఇంటి పట్టా

ఉచిత నివాస స్థలాలను కేటాయించిన ఐదేళ్ల అనంతరం వాటిని విక్రయించుకునే సౌలభ్యాన్ని కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని విక్రయించే సమయంలో సబ్‌రిజిస్ట్రార్లకు ఎలాంటి నిరభ్యంతర ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. లబ్ధిదారుడు ఇంటి స్థలానికి రూ.20 చెల్లించాలి. ఇందులో రూ.10 స్టాంపు పేపరు, మిగిలిన రూ.10 పట్టా ల్యామినేషన్‌కు ఖర్చుపెట్టనున్నారు. పూర్తివార్త కోసం క్లిక్‌ చేయండి 

6. వైద్యవిద్యలో ప్రవేశాలకు ఇక నీట్‌ ఒక్కటే

2020-21 వైద్యవిద్య సంవత్సరం నుంచి దేశంలో ఏ తరహా వైద్యకళాశాలలో ప్రవేశాన్ని పొందాలన్నా.. ఇక జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌) ఒక్కటే ప్రామాణికం కానుంది. తాజా నిబంధనతో అన్ని రకాల వైద్య సంస్థల్లోనూ వైద్యవిద్య ప్రవేశాలు నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే భర్తీ అవుతాయి. విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు నీట్‌లో అర్హత సాధించాలి. సోమవారం(2వ తేదీ) నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వచ్చే ఏడాది మే 3న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అయోధ్య తీర్పుపై పునఃసమీక్ష పిటిషన్‌

అయోధ్య భూ వివాదంపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని ‘రామ్‌ లల్లాకు’ ఇవ్వాలని, సున్నీ వక్ఫ్‌ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరేచోట 5 ఎకరాల భూమిని కేటాయించాలని గత నెల 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎం.సిద్దిఖ్‌ అనే కక్షిదారుకు చట్టబద్ధ వారసుడు, ‘జామియత్‌ ఉలేమా ఎ హింద్‌’ అధ్యక్షుడు మౌలానా సయ్యద్‌ అషద్‌ రష్డీ పునఃసమీక్ష పిటిషన్‌ వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎందుకీ ఉల్లికిపాటు?

దేశంలో ఏటా 1.20 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి వేస్తున్నారు. ఉల్లి సాగు రాష్ట్రాల్లో వర్షాకాలంలో భారీ నుంచి అతిభారీ వానలు కురిశాయి. సాధారణ పరిస్థితితో పోలిస్తే మహారాష్ట్రలో ఒకటిన్నర రెట్లు, గుజరాత్‌లో రెండు రెట్లు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో 70 శాతం, తెలంగాణలో 65 శాతం అధికంగా నమోదయ్యాయి. దాంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మిస్‌మ్యాచ్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక

10. అద్భుత జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్న బాలుడు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.