close

తాజా వార్తలు

ఆధునిక రోటా వ్యాక్సిన్‌ ఆవిష్కరణ

దిల్లీ: ఆధునీకరించిన రోటా వ్యాక్సిన్‌ ‘ రోటా వ్యాక్స్‌5డి’ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేశారు. రెండేళ్లలోపు పిల్లలకు డయేరియా వ్యాధి నివారణ కోసం ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. ఇప్పటి వరకు దీనిని మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తున్నారు. ఆ పరిస్థితిని అధిగమించే రీతిలో భారత్‌ బయోటెక్‌ సంస్థ వ్యాక్సిన్‌ను ఆధునీకరించింది. సాధారణ ఉష్ణోగ్రతలోనూ భద్రపరిచేలా దీనిలో మార్పులు చేశారు. ఇప్పటివరకు 100 మిలియన్ల రోటావ్యాక్‌ వ్యాక్సిన్లను భారత్‌ బయోటెక్‌ సంస్థ సరఫరా చేసింది. చిన్నారుల ఆనందకర జీవనానికి, ఆరోగ్యానికి ఈ టీకాలు ఎంతో కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. టీకాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటిపై ఉండే అపోహల నివారణకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో వైద్యులు, మీడియా, ప్రజాసంఘాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.