close

తాజా వార్తలు

రాజ్‌నాథ్‌సింగ్‌ కాన్వాయ్‌కి అడ్డంగా నిలబడి..

దిల్లీ: దేశ రాజధాని ప్రాంతం దిల్లీలో నిరంతరం నిఘా నీడలో ఉండే పార్లమెంట్‌ వద్ద మంగళవారం భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. అత్యున్నత భద్రతా సిబ్బంది పహారా కాసే ప్రదేశంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి తాను ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని అడిగాడు. ప్రధాని మోదీ ఝార్ఖండ్‌ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ వ్యక్తి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కాన్వాయ్‌ పార్లమెంట్‌ భవనం నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఆ వాహన శ్రేణికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. దీంతో వాహనం ఆగగానే తాను ప్రధానిని కలవాలనుకుంటున్నట్టు వారితో చెప్పాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఓ ఆందోళనకారుడిగా భావిస్తున్న పోలీసులు తమ వ్యాన్‌లోకి ఎక్కించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.