close

తాజా వార్తలు

‘ఆ నలుగురి’ దాడికి పునాది వేసిన కపిల్‌

దిల్లీ: ప్రస్తుతం టీమిండియా పేస్‌ దాడి మరో స్థాయిలో ఉండటానికి కపిల్‌దేవ్‌ వంటి మాజీ పేసర్లు వేసిన పునాదే కారణమని వెస్టిండీస్‌ దిగ్గజం ఇయాన్‌ బిషప్‌ అన్నారు. పేస్‌ దాడిని ఇష్టపడే విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో బౌలింగ్‌ విభాగం మరింత దృఢంగా మారిందన్నారు.

‘ప్రస్తుత బౌలర్లు ఇప్పటికిప్పుడే అత్యుత్తమ స్థాయిని అందుకోలేదు. ఇందుకు పునాదులు ఎప్పుడో పడ్డాయి. ఒక్కసారి వెనక్కిమళ్లి చూస్తే కపిల్‌ దేవ్, జవగళ్‌ శ్రీనాథ్‌, జహీర్‌ ఖాన్‌, మునాఫ్ పటేల్‌, శ్రీశాంత్‌ కనిపిస్తారు. ఇప్పటి సారథికి పేసర్లంటే ఇష్టం. వారిని అతడు నమ్మాడు. తరాలకు గుర్తుండిపోయే జస్ప్రీత్‌ బుమ్రాను గుర్తించారు. అతడు అన్ని ఫార్మాట్లలోనూ రాణించగలడు. షమి, ఇషాంత్‌ తమ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని బిషన్‌ అన్నారు.

‘ఒకప్పుడు మేం ఇతరులకు చేసిందే టీమిండియా మాకు చేస్తుందని అనుకోలేదు. ఈ ఘనత బౌలింగ్‌ కోచ్ భరత్‌ అరుణ్‌, క్రికెట్‌ పాలకులు, సారథులదే. ఇంత మెరుగదల గతంలో నేనెప్పుడూ చూడలేదు. 90 మైళ్ల వేగానికిపైగా బంతులు వేసే బౌలర్లు ఉండటం గొప్పగా ఉంటుంది. టీమిండియా పేసర్లు బాగా ఆడుతున్నప్పుడు పోలికలు రావడం సహజమే. నేను వీటికి దూరంగా ఉంటాను. ఎందుకంటే ఎలా కొలవాలో నాకు తెలీదు. ఎన్నో ఏళ్లు కలిసి బౌలింగ్‌ చేసిన మైకెల్‌ హోల్డింగ్‌, జోయెల్‌ గార్నర్‌, మాల్కమ్‌ మార్షల్‌, కొలిన్‌ క్రాఫ్ట్‌, ఆండీ రాబర్ట్స్‌ గురించి మాట్లాడుతుంటే వారితో పోల్చగలం’ అని బిషన్‌ అన్నారు.

ప్రస్తుతమున్న వారిలో అత్యుత్తమ బౌలర్‌ను ఎంపిక చేసేందుకు ఇయాన్‌ విముఖత చూపించారు. ‘చాలామంది ఉన్నారు. మంచి లయలో ఉన్నప్పుడు జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడం కష్టం. నసీమ్‌షా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి అద్భుతం. దేవుడా, షమి అంటే నాకెంతో ఇష్టం! టీమిండియా ప్రధాన పేస్‌దాడిలో ఒకరిని ఎంచుకొని వీరు అత్యుత్తమం అని చెప్పలేను. శివమ్‌ మావి, కమలేశ్‌ నాగర్‌ కోటి ఇలాగే కొనసాగుతారో లేదో చూడాలి. టీ20 ప్రపంచకప్‌ గెలిచినంత మాత్రాన కోహ్లీసేనను ఓడించడం విండీస్‌కు సులభం కాదు. వారితో ఆడటం వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా పనికొస్తుంది’ అని బిషన్‌ పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.