close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. రాష్ట్ర భద్రతా కమిషన్‌ ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్ర భద్రతా కమిషన్‌తోపాటు పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు మండలి (పోలీసు కంప్లయింట్‌ అథారిటీ)ని ఈ నెల 27లోగా ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే 30న జరిగే విచారణకు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. విచారణ @ ఆన్‌లైన్‌

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవిచారణలో సాంకేతిక విప్లవం ఆరంభమైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ముందున్న రాష్ట్రం తాజాగా మరో ఘనత సాధించింది. ఏదైనా నేరం జరిగినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి న్యాయస్థానంలో తీర్పు వెలువడే వరకు జరిగే ప్రక్రియలన్నీ ఇకమీదట ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. ‘ఇంటర్‌ అపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ (ఐసీజేఎస్‌)గా పిలిచే ఈ ప్రక్రియను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ బుధవారం ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కరెంటు షాక్‌ లేదు

ఆంధ్రప్రదేశ్‌లో గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఛార్జీల ప్రతిపాదనను అందచేశాయి. నెలకు 500 యూనిట్లలోపు వినియోగించే వారిని మినహాయించి మిగిలిన కేటగిరిల్లో ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. స్థానిక సంస్థలు, ఎత్తిపోతల పథకాలు, రక్షిత మంచినీటి పథకాలు, రైల్వేలు, వాణిజ్య వినియోగం, కోళ్ల పరిశ్రమ తదితరాలకు ఛార్జీలను పెంచాలని కోరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఏ రోజూ భాజపాకు దూరం కాలేదు

‘ప్రత్యేక హోదా అంశంపై భాజపాతో విభేదించానే తప్ప.. ఏ రోజూ దూరం కాలేదు. కేవలం ప్రత్యేక హోదా కోసమే దూరం కావాల్సి వచ్చింది. ప్రజల ప్రయోజనాల కోసం సమీకరణాలు మారుతుంటాయి. రెండో రాజధాని ఏర్పాటు అంశం అంబేడ్కర్‌ చెప్పింది తప్ప.. నేను సొంతంగా మాట్లాడింది కాదు. ఈ విషయమై దేశ పరిస్థితులను బట్టి అవసరమా? లేదా? అనేది పరిశీలించి కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. జనసేనను భాజపాలో విలీనం చేస్తారేమో: జీవీఎల్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పార్టీని భాజపాలో విలీనం చేస్తారేమోనని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. భాజపాతో విభేదాలు లేవంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే భావించాల్సి వస్తోందని జీవీఎల్‌ తెలిపారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే భాజపాలో జనసేనను విలీనం చేయాలని కోరగా పవన్‌ అంగీకరించలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. శ్రీచైతన్య విద్యాసంస్థల... ‘ఫిట్‌ ఇండియా’ ప్రపంచ రికార్డులు

శ్రీచైతన్య విద్యాసంస్థలు బుధవారం రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి. ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమంలో భాగంగా... ఏడు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు 214 వేదికలపై ఏకకాలంలో ఏడు నిమిషాల పాటు ‘స్పోర్ట్స్‌ డ్రిల్‌’ను నిర్వహించారు. ఈ విభాగంలో రికార్డును నమోదు చేశారు. మూడు నుంచి అయిదో తరగతి విద్యార్థులు సుమారు 76 వేల మంది 214 వేదికలపై విరామం లేకుండా 15 నిమిషాల పాటు 45 యోగాసనాలను ప్రదర్శించి మరో కొత్త రికార్డును సృష్టించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అవినీతిపరులను అనిశాకు పట్టిస్తే బహుమతి

అంతర్జాతీయ అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా వరంగల్‌ కేంద్రంగా ఉన్న అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. అవినీతిపరులను అనిశాకు పట్టించి ద్విచక్రవాహనం, బంగారం, సెల్‌ఫోన్‌లను బహుమతులుగా గెలుచుకోండంటూ గోడ పత్రికలను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. డేటా దుర్వినియోగానికి మూడేళ్ల జైలు

ఇంటర్నెట్‌ కంపెనీలు ఖాతాదార్ల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే భారీ శిక్షలు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌) బిల్లు పేరుతో దీన్ని రూపొందించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే సమాచార పరిరక్షణకు బాధ్యుడైన ‘ఎగ్జిక్యూటివ్‌’కు మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఆ కంపెనీకి రూ.15 కోట్లుగానీ, అంతర్జాతీయ టర్నోవర్‌లో నాలుగు శాతం మేరగానీ జరిమానాగా విధిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. సుందర్‌ పిచాయ్‌కు మరో కీలక పదవి

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు అద్భుత అవకాశం దక్కింది. మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సైతం ఆయనే సీఈఓగా వ్యవహరించనున్నారు. ఈ సాంకేతిక దిగ్గజం సహ వ్యవస్థాపకులు లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లు తమ పాత్రల నుంచి తప్పుకోవడంతో.. భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్‌ దిగ్గజంగా మారనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ‘భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌’ ఈ నెల్లోనే తొలి ఇష్యూ!

ఇక నుంచి డెట్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌లూ అందుబాటులోకి రానున్నాయి. ‘భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌’ పేరుతో మొదటి విడత ఇష్యూ ఈ నెలల్లోనే ఉండే అవకాశం ఉంది. బాండ్ల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలకు అదనపు నిధుల వనరును సృష్టించేందుకు బాండ్ల ఈటీఎఫ్‌లు దోహదం చేస్తాయని ప్రధాన నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశానంతరం విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.