close

తాజా వార్తలు

మ్యాచ్‌లో ఓడినా టైటిల్ మనదే!

కాన్‌బెర్రా: మూడు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత యువ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1-2 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆసీస్‌ క్రీడాకారిణి విల్సన్‌ (15, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా భారత ప్లేయర్‌ గగన్‌దీప్‌ కౌర్‌ (53వ నిమిషంలో) ఒక్క గోల్‌ చేసింది. దీంతో భారత్, ఆసీస్ 7 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాయి. అయితే, ఆసీస్‌ కంటే మెరుగైన్‌ గోల్స్‌ సగటు ఆధారంగా భారత్‌కు టైటిల్‌ దక్కింది. ఈ టోర్నీలో నాలుగు మ్యాచులు ఆడిన భారత్ రెండింట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడి మరొక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ‌ఈ టోర్నీలో పాల్గొన్న మరో జట్టు న్యూజిలాండ్‌ నాలుగు మ్యాచుల్లో మూడు పాయింట్లు మాత్రమే సాధించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.