close

తాజా వార్తలు

హెల్మెట్‌తో కాలుష్యం కట్‌..

శిరస్త్రాణం అంటే తలకు రక్షణనిస్తుందని తెలుసు. కానీ  ఆర్‌-పుర్‌ నానో మాస్క్‌ హెల్మెట్‌ కేవలం భద్రత ఇవ్వడమే కాదు కాలుష్యాన్ని వడగట్టి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది కూడా. ఈ అత్యాధునిక హెల్మెట్‌ని బైకర్లతోపాటు రన్నర్లు, సైక్లిస్టులు కూడా ఉపయోగించవచ్చు. తీవ్రమైన హాని కలిగించే విషపూరిత అణువులు, పుప్పొడి రేణువులు, బ్యాక్టీరియా, డీజిల్‌ పొగనుంచి వెలువడే విషరసాయనాలను అడ్డగించి శుభ్రం చేయడానికి దీని ముందుభాగంలో మాస్కులో లేయర్లుంటాయి. చూడ్డానికి స్టైలిష్‌గా, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఈ మాస్కు తలకి, మెడకి వెనకాల ఎలాస్టిక్‌ బ్యాండ్‌లతో బిగించుకునేలా ఉంటుంది. మనం ఉన్నచోట గాలి స్వచ్ఛతను తెలిపేలా మాస్కు ముందుభాగంలో ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతుంటాయి కూడా. గాలి నాణ్యత బాగుంటే ఆకుపచ్చ, కాలుష్యం ఎక్కువైతే ఎరుపు మిణుమిణుకుమంటాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.