
తాజా వార్తలు
దిల్లీ: పెదాల కదలికలతో సినిమా డైలాగ్‌లకు అభినయం చేయడం, పాటలకు నృత్యాలు చేయడం వంటి సరికొత్త ఫీచర్లతో వచ్చిన టిక్ టాక్ యాప్ అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. తాజాగా ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 1బిలియన్ డౌన్లోడ్ల మార్క్‌ను దాటింది. చైనాలోని బీజింగ్ కేంద్రంగా బైట్‌డాన్స్ కంపెనీ ఈ సోషియల్ వీడియో యాప్‌ను నిర్వహిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల ద్వారా అత్యధిక మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని సెన్సార్ టవర్ తెలిపింది. చైనాలోని ఆండ్రాయిడ్ ఇన్‌స్టాల్స్‌తో సంబంధం లేకుడానే లైట్ వెర్షన్, రీజినల్ వేరియేషన్లతో 71.3మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకున్నారని అందులో పేర్కొంది. గతేడాది నాన్-గేమింగ్ యాప్‌గా ప్రపంచవ్యాప్తంగా నాలుగోస్థానంలో ఉన్న టిక్‌టాక్ జనవరిలో మూడోస్థానానికి చేరింది. యూఎస్‌లో మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇందులో 25శాతం టిక్ టాక్ డౌన్లోడ్లు భారత్ నుంచే వచ్చాయి. దాదాపు 250మిలియన్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. జనవరి నెలలో 43శాతం కొత్త వినియోగదారులు భారత్ నుంచే రాగా, గతేడాది ఈ పెరుగుదల 9.5శాతంగా ఉంది. యూఎస్‌లోనూ యాప్‌ను వాడుతున్న వినియోగదారుల్లో పెరుగుదల కనిపించింది. గతేడాది 5.6శాతం వినియోగదారులుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9శాతానికి పెరిగింది. గతేడాది ఫేస్‌బుక్‌కు 711 మిలియన్ ఇన్స్టాల్స్ ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌కు 444మిలియన్ల డౌన్లోడ్లున్నాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
