close

తాజా వార్తలు

‘కళంక్‌’ పాట..డ్యాన్స్‌తో అదరగొట్టిన ఆలియా


 

ముంబయి: బాలీవుడ్‌ నటులు మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌, ఆలియా భట్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళంక్‌’. అభిషేక్‌ వర్మన్‌ ఈ ప్రతిష్ఠాత్మక సినిమాను తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలోని ‘ఘర్‌ మోరే పర్‌దేశియా..’ అనే తొలి పాట వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. పాటలో యువరాణి అయిన ఆలియా.. మాధురీ దీక్షిత్‌ పాటకు చేసిన డ్యాన్స్‌ ఆకట్టుకుంటోంది. ఈ పాటను శ్రేయా ఘోషల్‌, వైశాలి ఆలపించారు. ఇందులో ఆలియా రూప్‌ అనే యువరాణి పాత్రలో నటించారు. భారత్‌కు స్వాతంత్రం రాకముందు ఓ యువరాణికి ఓ వ్యక్తి మధ్య చిగురించిన ప్రేమకథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.