
తాజా వార్తలు
దిక్సూచి
ఏ ఊరుకు వెళ్లినా.. ఏ టూరుకు వెళ్లినా.. దాదాపు అందరికీ ఎదురయ్యే సమస్య టాయ్‌లెట్ కనుక్కోవడమే! సులభ్ కాంప్లెక్స్‌ను వెతికి పట్టుకోవడం అంత సులభం కాదు. కాస్త అర్జెంట్ అయితే.. ఆ కష్టం పగవాడికి కూడా రావొద్దనిపిస్తుంది. ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారం ‘టాయ్ఫై’ (ToiFi- Toilet Finder)యాప్. టాయ్‌లెట్ ఫైండర్ అప్లికేషన్ సహాయంతో సమీపంలో ఉన్న పబ్లిక్ టాయ్‌లెట్స్ సమాచారం తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ సహాయంతో నిమిషాల వ్యవధిలో అక్కడికి వెళ్లిపోవచ్చు. ‘పే అండ్ యూజ్’ మూత్రశాలల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడున్నరలక్షల మూత్రశాలల సమాచారం యాప్‌లో పొందవచ్చు. అవి తెరిచి ఉంచే సమయాలు కూడా అందుబాటులో ఉంటాయి. దివ్యాంగులకు అనువైన మూత్రశాలల సమాచారం కూడా ఇందులో లభిస్తుంది. పని పూర్తయ్యాక.. హమ్మయ్య! అనుకోవడంతో పాటు మూత్రశాలల నిర్వహణపై రేటింగ్ కూడా ఇవొచ్చు.