close

తాజా వార్తలు

సమాచారం డ్యాష్‌కామ్‌ గుప్పిట్లో

భద్రత, అదనపు సౌకర్యం కోరుకునేవారు కార్లలో డ్యాష్‌కెమెరా బిగించుకోవడం ఇప్పుడు మామూలైపోయింది. అలాంటివాళ్ల కోసం కెంట్‌ కంపెనీ మేటి ఫీచర్లతో ‘క్యామ్‌ఐ’ పేరుతో డ్యాష్‌ కెమెరా విడుదల చేసింది. దాని ప్రత్యేకతలు.

* ఇది జీపీఎస్‌ సౌకర్యంతో వచ్చింది. రియల్‌టైమ్‌లో ట్రాకింగ్‌ చేసుకోవచ్చు.
* అన్ని డ్యాష్‌ కెమెరాలు ముందున్న పరిసరాల్ని మాత్రమే రికార్డు చేస్తుంటాయి. ఇది క్యాబిన్‌లో కూడా రికార్డు చేస్తుంది.
* 8 జీబీ స్టోరేజీతో తొంభైరోజుల ఫుటేజీ ఇందులో  నిల్వ ఉంటుంది. మన ప్రయాణం రికార్డుని ప్లేబ్యాక్‌ చేసుకొని చూసుకోవచ్చు.
* క్యామ్‌ఐ అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని దీన్ని మన స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.
* డ్రైవరు నిద్రపోతున్నా, అపరిచిత వ్యక్తులు స్టీరింగ్‌ పట్టుకున్నా కెమెరా గుర్తించి స్మార్ట్‌ఫోన్‌కి సందేశం పంపిస్తుంది.
* 3000 ఎంఏహెచ్‌ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో పనిచేస్తుంది. ఓబీడీ పోర్ట్‌తో అనుసంధానం అవుతుంది.
* ధర రూ.17,999


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.