
తాజా వార్తలు
చిన్న నేరాలకు చెక్
సత్ఫలితాలిస్తున్న యాప్
న్యూస్‌టుడే, కరీంనగర్ నేరవార్తలు
నేరాల అదుపు, శాంతిభద్రతల పర్యవేక్షణకు కరీంనగర్ కమిషనరేట్‌లో అమల్లోకి తెచ్చిన ఈ-పెట్టికేసు యాప్ సత్ఫలితాలనిస్తోంది. 2017 మార్చి 24న పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్‌రెడ్డి ఈ-పెట్టికేసు యాప్‌ను ప్రారంభించారు. కమిషనరేట్‌లో ఈ-పెట్టికేసు ప్రారంభమైనప్పటి నుంచి చిన్న నేరాలకు పాల్పడిన 12,071 మందిపై కేసులు నమోదయ్యాయి.
దళారుల ఆటలు సాగవు
గతంలో ఏవైనా చిన్న చిన్న సంఘటనలు జరిగిన సందర్భాల్లో దళారులు తలదూర్చి తమవారేనంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చేవారు. ఇలాంటి దళారుల ఆటలు సాగకుండా ఈ-పెట్టి కేసులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు నిమిషాల్లోనే ఆధారాలతో కేసులు నమోదు కావడంతో దళారులు తలదూర్చే అవకాశం లేకుండా పోయింది. నియమ నిబంధనలు విస్మరించిన వారికి శిక్షలు పడుతున్నాయి.
నేరాల నియంత్రణలో భాగంగా చిన్న నేరాలను ప్రారంభంలోనే అరికట్టినట్లయితే పెద్ద నేరాలు జరిగే అవకాశం ఉండదనే ఉద్దేశంతో రాష్ట్ర పోలీసుశాఖ ఈ-పెట్టికేసు యాప్ విభాగాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రహదారి, ఫుట్‌పాత్ ఆక్రమణలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, డీజేల వినియోగం లాంటి చిన్న నేరాలకు పాల్పడే వారిని ఈ-యాప్‌లో చేర్చి కేసులు నమోదు చేస్తున్నారు. ఆక్రమణలను తొలగించి ట్యాబ్‌ల ద్వారా అక్కడికక్కడే ఫొటోలు, వీడియోలు తీసి తగిన ఆధారాలతో క్షణాల్లో ఈ-పెట్టికేసు యాప్‌లో నమోదు చేసే విధానంపై పోలీసులకు శిక్షణ ఇచ్చారు.
కోర్టుకు వెళ్లే రోజు నిర్ణయం
పట్టణంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల ద్వారానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఏదైనా గొడవలు జరిగినా, ఆక్రమణలు జరిగినా వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకుంటారు. నిందితుల వివరాలతో కేసు నమోదు చేసిన వెంటనే కోర్టుకు హాజరయ్యే తేదీని తెలియజేస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను రికార్డుల్లోకి నిక్షిప్తం చేస్తారు. దీంతో నిందితులు తప్పించుకునే అవకాశం ఉండదు. ఇలా చేయడం వలన నిందితుల వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. వారు మరోసారి నేరానికి పాల్పడే అవకాశం ఉండదు.
నేరాలను అదుపు చేయడం
ఈ-పెట్టికేసుల విషయంలో గతంలో నిందితులకు బదులు మరొకరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండేది. ఈ-పెట్టికేస్ యాప్‌ను సీసీటీఎన్ఎస్కు అనుసంధానం చేశారు. దీని ద్వారా ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నంబర్లు నమోదు చేయడంతో గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు లేకుండా పోయాయి. ఈ-పెట్టికేసు యాప్‌లో కేసుల నమోదు కోసం పోలీసు అదికారులకు 90 ట్యాబ్‌లు, 25 ఐపాడ్లను అందజేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా 2017 మార్చి నుంచి ఇప్పటివరకు 12,071 కేసులను నమోదు చేశారు. నియమ నిబంధనలను విస్మరించిన వారికి రెండు వందల నుంచి ఏడు వేల వరకు జరిమానాలు విధిస్తున్నారు.
నమోదు చేసే కేసులు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, ధూమపానం, చిన్న చిన్న గొడవలు, డీజే సౌండ్లు, అర్ధరాత్రి వరకు తెరిచి ఉండే దుకాణాలు, ఆలస్యంగా మూతపడే బార్లు, రెస్టారెంట్లు, రహదారి, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, నిషేధిత ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చడం, పబ్లిక్ న్యూసెన్స్‌లకు పాల్పడే వారిపై ఈ-పెట్టికేస్ యాప్‌లో కేసులు నమోదు చేస్తారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
