
తాజా వార్తలు
నూతన సాంకేతికతతో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి
ఎలక్ట్రిక్ కార్లకు ప్రస్తుతం మన దేశంలో బాగా డిమాండ్ పెరిగింది. అనేక కంపెనీలు విదేశీ సాంకేతికతను ఉపయోగించి ఇప్పుడిప్పుడే బ్యాటరీ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే కేరళలోని ఓ కార్ల కంపెనీ మాత్రం 20 ఏళ్ల క్రితమే విద్యుత్తు కార్లను తయారు చేసి భారతదేశ సాంకేతికతను ప్రపంచానికి చాటి చెప్పిందంటే నమ్ముతారా? ఇప్పుడు మరోసారి తన సత్తా చాటేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళలోని త్రిసూర్ జిల్లా చలక్కుడిలోని ‘ఎడ్డీ కరెంట్ కంట్రోల్స్ ఇండియా లిమిటెడ్’ అనే సంస్థ రెండు దశాబ్దాల క్రితమే విద్యుత్తు కార్లను తయారు చేసింది. 1971లో ఎన్డీ జోష్ స్థాపించిన ఈ సంస్థ దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతోనే అద్భుతాలు సృష్టించింది.
1993లో ‘లవ్‌బర్డ్స్’ అనే విద్యుత్తు కార్లను రూపొందించింది. అప్పట్లో ఇది అందరికీ నచ్చిన కార్లలో ఒకటి. కేవలం ఇద్దరకి మాత్రమే అనువైన ఈ కారు బ్యాటరీతో పనిచేస్తుంది. ఎనిమిది గంటలు ఛార్జి చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు అరవై కి.మీ వేగంతో కారు నడుస్తుంది. కార్లకు అంతగా గిరాకీ లేని కాలంలోనే ఈ కార్లు 25 అమ్ముడు పోయాయి. కానీ ప్రభుత్వం రాయితీలు ఎత్తివేయడంతో ఈ కార్ల ఉత్పత్తి నిలిపివేశారు. తాజాగా దీనికి మరింత సాంకేతికత జోడించి కొత్త రకం మోడల్ తయారీకి శ్రీకారం చుట్టారు. ‘1996లో గోల్ఫ్ క్లబ్లో ఉపయోగించే బగ్గీలు, కార్లను సైతం తయారు చేశాం. ఇప్పుడు భారత నావికా విభాగం, రైల్వే విభాగం కోసం బ్యాటరీతో పనిచేసే ట్రక్కులను తయారు చేస్తున్నాం’ అని సంస్థ డైరెక్టర్ మాథ్యూ జోస్ తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
