Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142510
            [news_title_telugu_html] => 

200 కేజీలు మించితే భారమే

[news_title_telugu] => 200 కేజీలు మించితే భారమే [news_title_english] => [news_short_description] => నాకు 2013 మోడల్‌ హోండా యాక్టివా ఉంది. ఈమధ్యే రెండూ కొత్త టైర్లు వేయించాను. ఇవి మార్చిన తర్వాత బండిపై ఇద్దరం, ముగ్గురం వెళ్తున్నప్పుడు స్కూటీ వణుకుతోంది. టైర్లు, వీల్‌ అలైన్‌మెంట్‌ మరోసారి చెక్‌ చేయించాను. అంతా బాగానే ఉందంటున్నారు. మరెందుకీ సమస్య? [news_tags_keywords] => mechanic guru, honda activa, automobile issue, rai rai, eenadu special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-16 01:06:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
200 కేజీలు మించితే భారమే - EENADU
close

తాజా వార్తలు

200 కేజీలు మించితే భారమే

మెకానిక్‌గురూ

* నాకు 2013 మోడల్‌ హోండా యాక్టివా ఉంది. ఈమధ్యే రెండూ కొత్త టైర్లు వేయించాను. ఇవి మార్చిన తర్వాత బండిపై ఇద్దరం, ముగ్గురం వెళ్తున్నప్పుడు స్కూటీ వణుకుతోంది. టైర్లు, వీల్‌ అలైన్‌మెంట్‌ మరోసారి చెక్‌ చేయించాను. అంతా బాగానే ఉందంటున్నారు. మరెందుకీ సమస్య?

- రోహిత్‌ కోసూరి

సాధారణంగా 150 నుంచి 200 కిలోల బరువు భరించగలిగేలా స్కూటీని తయారు చేస్తారు. అంతకుమించి భారం మోపితే ప్రమాదకరం. ఇదికాకుండా త్రిబుల్‌ రైడింగ్‌ చట్టవిరుద్ధం. చక్రం వణుకుతోంది అంటే వీల్‌ రిమ్‌ మీద టైరు పొందిగ్గా కూర్చుందో, లేదో ఒక్కసారి చెక్‌ చేయించండి. ఇందులో తేడా వచ్చినప్పుడు ఇది ఒకేవైపు లాగుతుంది. దీంతోపాటు టైరులో గాలి తగినంత ఉందా? లేదా? పరిశీలించండి.
*నా ఎత్తు 6.5 అడుగులు. నాకు తగ్గట్టుగా పాత హీరో కరిజ్మా ఆర్‌, కరిజ్మా జెడ్‌ఎంఆర్‌ రెండింట్లో ఏదైనా బైక్‌ తీసుకోవాలనుకుంటున్నాను. ఫర్వాలేదా? మీరింకేదైనా సూచిస్తారా?

- అనిల్‌కుమార్‌

 

ఎత్తుగా ఉండే రైడర్ల కోసం హీరో కరిజ్మా మోడల్‌ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీని ఉత్పత్తి ఆపేశారు. పాత విడిభాగాలు దొరకడం కష్టం. వీటి స్థానంలో ఎక్స్‌ట్రీమ్‌, ఎక్స్‌పల్స్‌ మోడళ్లు తీసుకొచ్చారు. ఎక్స్‌పల్స్‌ 200 ఆఫ్‌రోడ్‌ బైక్‌. ఎత్తు 823 ఎంఎం. మీకు చక్కగా సరిపోతుంది. స్పోర్టియర్‌ లుక్‌, మంచి సామర్థ్యం ఉన్న బండి కావాలనుకుంటే ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్‌ ప్రయత్నించవచ్చు. మేటి డిజైన్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, ఇతర ఫీచర్లున్నాయి. హీరో కాకుండా బజాజ్‌ పల్సర్‌ 220 కూడా మీ అవసరాలకు సరిపోతుంది.
* సర్‌, నేను సెకండ్‌హ్యాండ్‌ వాహనం కొనాలనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి యజమాని నుంచి ఏమేం డాక్యుమెంట్లు తీసుకోవాలో తెలియజేయగలరు. ఈ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది?

- విజయ్‌ రవి

 

ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, బీమా, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ తప్పకుండా తీసుకోవాలి. వాహనం కొన్న వెంటనే మీ పేరున మార్పించుకోవాలి. ట్రాన్స్‌ఫర్‌ వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (టీవీఆర్‌సీ) కావాలంటే ముందు చెప్పినవన్నీ ఉండటం తప్పనిసరి. తర్వాత ఫామ్‌ 28, 29, 30 పూర్తిచేసి రవాణాశాఖకు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తెలంగాణ రవాణాశాఖ వెబ్సైట్‌ చూడండి.

- హర్షిన్‌ లాల్‌పేట్‌, ఆటోమొబైల్‌ నిపుణుడు

(మీకూ ఇలాంటి సందేహాలు, సమస్యలుంట రాసి పంపండి)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.