close

తాజా వార్తలు

Updated : 30/08/2019 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పర్యావరణ ప్రేమికా.. మైలేజీ నీదిక!

పర్యావరణ ప్రేమికులకు రివోల్ట్‌ 400... రోజువారీ అవసరాలకేమో పల్సర్‌ 125... మైలేజీ ముఖ్యమనుకునేవారికి బజాజ్‌ సీటీ 110... వారం వ్యవధిలో మార్కెట్లోకి వచ్చిన ద్విచక్రవాహనాలివి... సరికొత్త ఫీచర్లు.. మేటి డిజైన్‌.. మంచి మైలేజీ వీటి ప్రత్యేకత అంటున్నాయి కంపెనీలు... పూర్తి వివరాలతో ఓసారి రైడింగ్‌ చేసేద్దాం.

తెలివైన బైక్‌

కృత్రిమ మేధస్సుతో వచ్చిన మొదటి విద్యుత్తు బైక్‌ రివోల్ట్‌ 400. పైగా ఇది సిసలైన భారతీయ కంపెనీ. మైక్రోమ్యాక్స్‌ సహవ్యవస్థాపకుడు రాహుల్‌శర్మ రివోల్ట్‌ ఇంటలికార్ప్‌ యజమాని. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసే సౌలభ్యం ఉండటం దీని ప్రత్యేకత.

డిజైన్‌: స్పోర్టీగా, స్లీక్‌ డిజైన్‌తో నేక్డ్‌ మోటార్‌సైకిల్‌ విభాగంలో వచ్చింది. ఎల్‌ఈడీలతో కూడిన హెడ్‌లైట్‌, డీఆర్‌ఎల్‌లతో ఆకర్షణీయంగా ఉంది. ఇది చైనీస్‌ బైక్‌ సోకో టీఎస్‌ 200ఆర్‌ మోడల్‌ స్ఫూర్తితో రూపొందించారు. ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ పూర్తిగా డిజిటల్‌గా ఉంది. బండి వేగం, కిలోమీటర్లు, ఇంధనం, ట్రిప్‌, టార్క్‌.. ప్రతి వివరాలు ఇందులో చూసుకోవచ్ఛు

ప్రత్యేకతలు: ద్విచక్రవాహనాన్ని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసిన తొలి ప్రయోగం మాదేనంటోంది రివోల్ట్‌ ఇంటలికార్ఫ్‌ రివోల్ట్‌ మొబైల్‌ యాప్‌ని ఫోన్‌లో నిక్షిప్తం చేసుకొని 4జీ సిమ్‌ వేసి బండిని కనెక్ట్‌ చేయొచ్ఛు వాహనం ఉన్న చోటు, జియో ఫెన్సింగ్‌, లాక్‌ సేవల్ని ఫోన్‌ ద్వారా తెలుసుకోవచ్ఛు డోర్‌స్టెప్‌ సర్వీసు, ఆన్‌లైన్‌ చెల్లింపులూ ఉన్నాయి.

బ్యాటరీ: రివోల్ట్‌ 3కిలో వాట్ల విద్యుత్తు మోటార్‌తో వచ్చింది. ఇంట్లో ఉండే 15ఏ పవర్‌ సాకెట్‌ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్‌ చేసుకోవచ్ఛు నాలుగు గంటల్లో పూర్తవుతుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 160కి.మీ.లు ప్రయాణిస్తుంది. బ్యాటరీకి ఎనిమిదేళ్లు లేదా లక్షా యాభై వేల కిలోమీటర్ల ప్రయాణం వరకు గ్యారెంటీ ఇస్తున్నారు. బండిలో ఎకో, సిటీ, స్పోర్ట్‌ అని మూడు రైడింగ్‌ మోడ్‌లున్నాయి.

* అత్యధిక వేగం 70కి.మీ.లు.

* దీంతోపాటే రివోల్ట్‌ 300 మోడల్‌నీ విడుదల చేశారు.

* ధర: రూ. 1.50 లక్షలు (ఎక్స్‌ షోరూం)

పోటీదారులకు మిన్నగా

ఈమధ్యే పల్సర్‌ నియాన్‌ 150 పేరుతో కొత్త మోడల్‌ విడుదల చేసింది. అచ్చంగా అదే డిజైన్‌తో 125సీసీ మోడల్‌ని తీసుకొచ్చారు. రెండు లో, నియాన్‌ బ్లూ, సోలార్‌ రెడ్‌, ప్లాటినం సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. సాధారణ కమ్యూటర్‌ ద్విచక్రవాహనాలతోనూ పోటీ పడటానికి ఈ మోడల్‌ తీసుకొచ్చినట్టు బజాజ్‌ చెబుతోంది.

ఫీచర్లు: బరువు, స్టైల్‌, పికప్‌, డిజైన్‌, రోడ్‌గ్రిప్‌.. ప్రతి విషయంలో 125సీసీ విభాగంలో పోటీదారులకన్నా మిన్నగా ఉండేలా రూపొందించారు. రెండు చక్రాలకూ డ్రమ్‌ బ్రేక్‌లు, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌, టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌, అనలాగ్‌ స్పీడోమీటర్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు. గ్లాసీ నలుపురంగు, మ్యాటీ గ్రే వర్ణంపై నీలం రంగు అంచులు రిచ్‌ రూపాన్ని తీసుకొచ్చాయి. కంబైన్డ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (సీబీఎస్‌) ఒక బ్రేక్‌ వేసినా రెండు చక్రాలపై సమాంతరంగా ఒత్తిడి పడేలా చూసి బండిని నియంత్రిస్తుంది. కిక్‌, సెల్ఫ్‌లతో స్టార్ట్‌ అవుతుంది.

ఇంజిన్‌: 5స్పీడ్‌ గేర్‌బాక్స్‌ డీటీఎస్‌-ఐ, 124.4సీసీ, ఎయిర్‌కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌, 11.8బీహెచ్‌పీ @్‌ 8500 ఆర్‌పీఎం ఇంజిన్‌.

బండి బరువు: 140కేజీలు

మైలేజీ: 55 కి.మీ.లు/లీటరు

ధర: .81వేలు (డ్రమ్‌ బ్రేక్‌), రూ.83వేలు (డిస్క్‌ బ్రేక్‌) (ఎక్స్‌ షోరూం)

- డీనోస్‌ వాల్ట్‌

మైలేజీ రాజా

హంగూ, ఆర్భాటం లేకుండా మధ్యతరగతి జనాన్ని ఆకట్టుకోవడానికి దూసుకొచ్చిన కమ్యూటర్‌ ద్విచక్రవాహనం సీటీ 110. చిరుద్యోగులు, చిల్లర వర్తకులకు నచ్చేలా ఎక్కువ మైలేజీనివ్వడం ఈ బండి ప్రత్యేకత అంటోంది బజాజ్‌. కేఎస్‌ అలాయ్‌, ఈఎస్‌ అలాయ్‌ అని రెండు రకాలున్నాయిందులో.

ప్రత్యేకతలు: రబ్బరు ట్యాంక్‌ ప్యాడ్‌లు, దృఢమైన హ్యాండిల్‌బార్‌, మెత్తటి కుషనింగ్‌ సీటు, అలాయ్‌ చక్రాలు చెప్పుకోదగ్గ ఫీచర్లు. మూడు రంగుల్లో లభిస్తోంది.

ఇంజిన్‌: 115సీసీ, ఎయిర్‌కూల్డ్‌, 8.6పీఎస్‌ సామర్థ్యం, 9.81ఎన్‌ఎం, 4స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఇంజిన్‌తో వచ్చింది. రెండు చక్రాలకు డ్రమ్‌ బ్రేక్‌లున్నాయి.

పోటీదారులు: టీవీఎస్‌ రేడియాన్‌ 110, హీరో స్ప్లెండర్‌

ఇంధన ట్యాంకు సామర్థ్యం: 10.5లీటర్లు

మైలేజీ: 95కి.మీ./లీటరు

అత్యధిక వేగం: 120కి.మీ.లు/గంట

ధర: రూ.37,997 - రూ.44,480 (ఎక్స్‌ షోరూం)

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని