close

తాజా వార్తలు

పండగొచ్చెనండీ!

సందర్భం

వేలమంది రైడర్లు ఒక్కచోటికి చేరతారు. ఆఫ్‌రోడ్డు పోటీలతో అదరగొడతారు. ఫ్యాషన్‌ షోలతో కేరింతలు కొడతారు. సంగీత ప్రదర్శనల్లో మునిగిపోతారు. ఈ సందడంతా ఇండియా బైక్‌ వీక్‌ సొంతం. ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఐదేళ్లుగా విజయవంతం అయ్యింది. ఆ ఊపుతో ‘ఇండియా బైక్‌ వీక్‌ 2019’ ఆరో ఎడిషన్‌ తేదీలను ప్రకటించారు నిర్వాహకులు. డిసెంబరు 6, 7 తేదీల్లో గోవాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌కి ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఇరవైవేల మంది రైడర్లు వస్తారని అంచనా. ఆటోమొబైల్‌ కంపెనీలు బైకర్ల కోసం 130 స్టాళ్లు ఏర్పాటు చేయబోతున్నాయి. రైడింగ్‌ జోష్‌లో తేలిపోవాలనుకునే ఔత్సాహిక బైకర్లు సిద్ధమవ్వండి మరి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.