close

తాజా వార్తలు

సూర్యతో కలిసి నటిస్తాడా?

ల్టీస్టారర్‌ చిత్రాల జోరు నడుస్తోంది. ఇద్దరు ముగ్గురు కథానాయకులు కలసి నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ దశలో మరో ఇద్దరు కథా నాయకులు కలిసి నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సూర్య, విజయ్‌ దేవరకొండ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నట్టు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘నోటా’తో తమిళంలో అడుగు పెట్టాడు విజయ్‌. అంతకు ముందే ‘గీత గోవిందం’ చిత్రం తమిళంలో అనువాద రూపంలో వెళ్లి, మంచి వసూళ్లు అందుకుంది. ‘నోటా’కీ అక్కడ మంచి మార్కెట్‌ ఏర్పడింది. అందుకే విజయ్‌తో ఓ సినిమా చేయాలని కొంతమంది తమిళ దర్శకులు, నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సూర్యతో కలసి ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.